సినిమా ప్లాప్ అవ్వడంతో పారితోషకం వెనక్కి ఇచ్చేసిన స్టార్ హీరో మరియు హీరోయిన్లు ఎవరో తెలుసా….

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కానీ హీరోయిన్ లు కానీ ఒక్కో సినిమాకు గాను కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు అన్న సంగతి అందరికి తెలిసిందే.ఒక్కోసారి సినిమా బాగానే ఉన్న కూడా అనుకున్నంత విజయం రాకపోవడంతో లేదా ప్లాప్ అవడంతో నిర్మాతకు నష్టం వస్తుంది.అలాంటి సమయంలో హీరోలు కానీ హీరోయిన్లు కానీ తమ రెమ్యూనరేషన్లో సగం తిరిగి ఇచ్చేయడం లేదా బాలన్స్ రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం వంటివి చేస్తుంటారు.ఇలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సినిమా ప్లాప్ అయినా తర్వాత నిర్మాతకు రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన హీరో హీరోయిన్లు విల్లే…

పవన్ కళ్యాణ్:జానీ మరియు పులి సినిమాలు ప్లాప్ అవ్వడం తో పవన్ కళ్యాణ్ తన పారితోషకంలో 40 శాతం నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారట.

మహేష్ బాబు:ఖలేజా సినిమా బాగానే ఉన్నప్పటికీ ప్లాప్ అవ్వడంతో మహేష్ బాబు తన పారితోషకంలో సగం నిర్మాతలకు తిరిగి ఇచ్చేసారు.

ఎన్టీఆర్:జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు చిత్రం ప్లాప్ అయినా సంగతి అందరికి తెలిసిందే.నరసింహుడు సినిమా ప్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ తన పారితోషకంలో సగం తిరిగి ఇచ్చేశారట.

రామ్ చరణ్:రామ్ చరణ్,జెనీలియా జోడిగా నటించిన ఆరెంజ్ సినిమా ప్లాప్ అవడంతో రామ్ చరణ్ తన పారితోషకంలో 30 శాతం నిర్మాతలకు తిరిగి ఇచ్చేసారు.వినయవిధేయ రామ చిత్రం తర్వాత రామ్ చరణ్ మరియు దానయ్య అయిదు కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి ఇచ్చేయడం జరిగింది.

త్రివిక్రమ్:త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అజ్ఞతవాసి చిత్రం ప్లాప్ అవ్వడంతో అయన తన పారితోషకంలో 20 శాతం నిర్మాతలకు తిరిగి ఇచ్చేయడం జరిగింది.

నందమూరి బాలకృష్ణ:గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం అనుకున్నంత వసూళ్లు సాధించకపోవడంతో బాలకృష్ణ తన పారితోషకంలో సగం మాత్రమే తీసుకున్నారు.

సాయి పల్లవి:ఫిదా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.ఆ తర్వాత వచ్చిన పడి పడి లేచే మనసు అనే చిత్రంతో ప్లాప్ అందుకుంది.దింతో సాయి పల్లవి తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *