సినిమాల్లోకి సితార ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు…

Vamsi Krishna
2 Min Read

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా,పరుశురాం దర్శకత్వం వహిస్తున్న చిత్రం సర్కారు వారి పాట.ఈ చిత్రం లో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ చిత్రం మే 12 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన టీసర్,సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులలో అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.సర్కారు వారి పాట సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ చిత్ర యూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్నారు.ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా యాంకర్ సుమతో మహేష్ బాబు,పరుశురాం ఇంటర్వ్యూ ని విడుదల చేయడం జరిగింది.

ఈ ఇంటర్వ్యూ లో హీరో మహేష్ బాబు పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.మహేష్ బాబు ముద్దుల కూతురు సితార సాంగ్ ప్రమోషన్ లో వీడియొ చేసిన సంగతి అందరికి తెలిసిందే.సోషల్ మీడియాలో సితార కు బాగా ఫాలోయింగ్ ఉంది.ప్రస్తుతం అందరి కళ్ళు సితార మీదనే ఉన్నాయని చెప్పచ్చు.ఇక మహేష్ బాబు గారాల పట్టి సీతారాను హీరోయిన్ గా తీసుకొస్తారా…లేక వేరే రంగంలో తీసుకెళ్తారా అనేది మహేష్ బాబు అభిమానులను వెంటాడుతున్న ప్రశ్న.ఈ చిత్రంలో పెన్నీ సాంగ్ లో సితార తన స్టెప్పులతో అందరిని ఆకట్టుకుంది.

ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు సితార గురించి మాట్లాడుతూ ఈ చిత్రం కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.ఈ చిత్రంలో పెన్నీ సాంగ్ లో సితార పెర్ఫార్మన్స్ గురించి మహేష్ బాబు ను అడిగినప్పుడు…అది తమన్ ఆలోచన..నాకు కూడా తెలియదు..ఇంటికి వెళ్లి నమ్రతను అడిగేలోపు అతనే అడిగేశాడు అని తెలిపారు.నేను క్లైమాక్స్ షూట్ లో బిజీ గా ఉన్నాను అప్పుడే డైరెక్టర్ నమ్రతతో మాట్లాడి సితార తో డాన్స్ ఓకే చేసేసారు అని మహేష్ తెలిపారు.నాకు అస్సలు చెప్పలేదు..నా షూటింగ్ అయినా వెంటనే మూడు రోజుల్లో ఆ పాటని షూట్ చేసారు అని తెలిపారు.ఆ తర్వాత వచ్చి చూపిస్తే నేను ఆశ్చర్యపోయాను.

తనని చూసి గర్వపడతాను అని మహేష్ తెలిపారు.అయితే ఈ పాట సినిమాలో ఉండదని ఈ విషయం గురించి సితార కు తెలిస్తే గొడవ పడుతుందని…భవిష్యత్తులో సితార గొప్ప యాక్ట్రెస్ అవుతుందని మహేష్ చెప్పుకొచ్చారు.మహేష్ బాబు మాటలు విన్న అభిమానులు సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *