Home సినిమా Kushi Movie: ఒకే టైటిల్ తో వచ్చిన ఈ రెండు సినిమాలలో ఏది ఎక్కువ కలెక్షన్స్...

Kushi Movie: ఒకే టైటిల్ తో వచ్చిన ఈ రెండు సినిమాలలో ఏది ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిందో తెలుసా.!

0
kushi movie

Kushi Movie: ఎస్ జె సూర్య దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హీరోగా,భూమిక హీరోయిన్ గా చేసిన సినిమా ఖుషి.ఏప్రిల్ 27 ,2001 వ సంవత్సరం లో రిలీజ్ అయినా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది.పవన్ కళ్యాణ్ కెరీర్ లో 7 వ చిత్రం గా వచ్చిన ఈ ఖుషి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి ఇరవై ఏళ్ళు పూర్తి అయ్యింది.పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఖుషి సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇప్పటికి ఈ సినిమా బుల్లితెర మీద ప్రసారం అయితే ఇష్టంగా చూసే ప్రేక్షకులు చాల మందే ఉన్నారు.ముఖ్యం గా ఈ సినిమా లో పవన్ కళ్యాణ్,భూమిక మధ్య చిత్రీకరించిన నడుము సీన్ బాగా హైలెట్ అని చెప్పచ్చు.

ఇక ఈ సినిమా లో అన్ని పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి.అమ్మాయే సన్నగా అనే సాంగ్ అయితే అప్పట్లో ట్రెండింగ్ గా నిలిచింది.పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా అప్పట్లో యెంత కలెక్షన్స్ రాబట్టింది అంటే..నైజం:7 .40 cr ,సీడెడ్:3 .35 cr ,ఉత్తరాంధ్ర:1 .60 cr ,ఈస్ట్:1 .50 cr ,వెస్ట్:1 .18 cr ,గుంటూరు:1 .50 cr ,కృష్ణ:1 .70 cr ,నెల్లూరు:0 .97 cr ,ఏపీ మరియు తెలంగాణ:19 .20 ,ఓవర్సీస్:1 .00 cr ,వరల్డ్ వైడ్:20 .20 cr రాబట్టింది.ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ  .13 కోట్లు జరిగితే ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.20 .2 కోట్లు షేర్ లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఖుషి సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్ లకు రూ.7 కోట్ల వరకు లాభాలు వచ్చాయి.అప్పట్లో ఇది చాల ఎక్కువ అని చెప్పచ్చు.

విజయ్ దేవరకొండ హీరోగా,సమంత హీరోయిన్ గా శివ నిర్మాణ దర్శకత్వం వహించిన సినిమా ఖుషి.మైత్రి మూవీ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు.సినిమా రిలీజ్ అవడానికి ముందు ఈ సినిమా పాటలు ట్రెండింగ్ గా నిలవడంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మించారు.ఈ సినిమా లో నటించిన నటి నటుల రెమ్యూనరేషన్ లు,సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్ లు,ప్రొమోషన్ ఖర్చులతో మొత్తంగా 100 కోట్లకు పైగానే అయ్యిందని సమాచారం.ఈ సినిమా బజ్ కు తగ్గట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి రూ.34 .6 కోట్లు జరిగింది.వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కు రూ.52 .5 కోట్లు బిజినెస్ జరిగింది.ఖుషి సినిమా థియరిటికల్,నాన్ థియరిటికల్ కలిపి రూ.142 .5 కోట్లు బిజినెస్ జరిగిందని సమాచారం.ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలకు 40 కోట్లకు పైగా టేబుల్ ప్రాఫిట్ ను తెచ్చి పెట్టిందని సినిమా వర్గాల అంచనా.ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తం గా 70 కోట్లకు పైగా థియరిటికల్ గా గ్రాస్ వసూళ్లను రాబట్టింది సమాచారం.ఓవర్ సీస్ లో భారీ లాభాలను తెచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో,ఇతర ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ ను సాధించటానికి కష్టాలు పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here