Fish Meat: భారతదేశంలోనే మొదటి సారి ల్యాబ్ లో చేప మాంసం ఉత్పత్తి…పూర్తి వివరాలు ఇవే

NEWS DESK
1 Min Read
Fish Meat

Fish Meat: దేశం లో సీఫుడ్ కు పెరుగుతున్న గిరాకీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దాంతో రోజు రోజుకు పెరుగుతున్న సీఫుడ్ గిరాకీని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా సరఫరాను పెంచేందుకు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రాజెక్ట్ ను చేపట్టింది.భారత దేశంలో తోలి సారిగా చేప మాంసాన్ని ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్ట్.

Also read : మళ్ళీ పెరిగిన పసిడి,వెండి ధరలు…!

సముద్ర జీవుల సమథోల్యాన్ని సంరక్షించుకుంటూ చేపల నుంచి వేరు చేసిన కణాల ను ప్రత్యేకంగా ల్యాబ్ లో డెవలప్ చేసి మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.ఇలా ల్యాబ్ లో ఉత్పత్తి చేసిన మాంసం రంగు,రుచి,పోషకాలు నిజమైన చేపల లా ఉంటాయని తెలిపింది.ఇక మొదటి దశలో చందువా చేప,కింగ్ ఫిష్,వంజరామ్ మాంసాన్ని ల్యాబ్ లో అభివృద్ధి చేస్తున్నట్లు రీసర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్ట్ చేప్పట్టనున్నట్లు రీసర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *