తెలుగు సినిమా ప్రేక్షకులకు కోవై సరళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సినిమాలలో తన కామెడీ తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యిని కోవై సరళ.తన కామెడీ టైమింగ్స్ తో అందరిని ఆకట్టుకుంటారు.బ్రమ్మానందం,కోవై సరళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లు అన్ని కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.కోవై సరళ తెలుగు తమిళ్ లో వందలలో సినిమాలు చేసారు.గత కొంత కాలంగా కోవై సరళ సినిమాలలో కనిపించడం లేదు.దాంతో ఆమె సినిమా లు మానేసారేమో అని కూడా చాల మంది లో అనుమానం కలిగింది.
ఈ సమయంలోనే తాజాగా ఆమె నటించిన సినిమా నుంచి ఆమెకు సంబంధించి పోస్టర్ ఒకటి విడుదల అయ్యింది.కోవై సరళ కు సంబంధించిన ఈ పోస్టర్ లో ఆమె అస్సలు గుర్తుపట్టలేనంతగా ఉన్నారు.ఆమె అభినేత్రి 2 అనే చిత్రంలో 2019 లో చివరిగా కనిపించడం జరిగింది.ఆ తర్వాత చాల గ్యాప్ తర్వాత ఒక విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కోవై సరళ.

తాజాగా కోవై సరళ తమిళ్ సినిమా సెంబి లో ఒక సరికొత్త మేకోవర్ లో ఎవ్వరు గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు.ప్రభు సల్మాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కోవై సరళ కనిపిస్తున్న తీరు అందరికి షాక్ కు గురి చేస్తుంది.ఈ చిత్రం కథ ఒక బస్సు జర్నీ నేపథ్యంలో సాగుతుంది అని అనిపిస్తుంది.డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్న కోవై సరళ పాత్ర ఈ చిత్రానికి కీలకం కానుందని తెలుస్తుంది.