నడిరోడ్డు మీద స్కూటీ పై వెళ్తూ ఈ యువతి,యువకుడు చేసిన పని చూస్తే అస్సలు నవ్వు ఆపుకోలేరు…వైరల్ వీడియొ…

couple bathing while riding on scooty vedio viral

నడిరోడ్డుపై స్కూటీ పై వెళ్తూ వెనుక కూర్చున్న యువతి చేస్తున్న పనికి నెటిజన్లు మరీ ఇంత అతి పనికి రాదు తల్లి అంటూ కామెంట్స్ చేస్తూ తిట్టిపోస్తున్నారు.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాల మంది ఎలాగైనా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు.చాల మంది పబ్లిక్ ప్లేసుల్లో తింగరి పనులు చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు.వాటికీ సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Advertisement

ముఖ్యంగా మెట్రో రైళ్లలో,రోడ్ల మీద జరిగే ఇలా ప్రవర్తించే వారి సంఖ్యా రోజురోజుకు ఎక్కువ అవుతుంది అని చెప్పచ్చు.తాజాగా రోడ్డు మీద ఒక యువకుడు,యువతి చేసిన పనికి పోలీసులు వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు.ఈ ఘటన మహారాష్ట్రలోని థానే లోని ఉల్లాసనగర్ లోని ఒక సిగ్నల్ వద్ద జరిగింది.ఒక యువతి యువకుడు రోడ్డు మీద స్కూటీ పై వెళ్తూ బకెట్ తో నీళ్లు తీసుకోని స్నానం చేసారు.

వెనుక కూర్చున్న యువతి తానూ నీళ్లు పోసుకుంటూ ముందు కూర్చున్న యువకుడికి కూడా నీళ్లు పోసింది.వీళ్ళ పిచ్చి వేషాలు చూసి అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు.చాల మంది పిచ్చి ఏమైనా పట్టిందా అంటూ కామెంట్స్ కూడా చేసారు.సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేయడంతో అది కాస్త పోలీసుల కంట్లో పడింది.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు ఈ వీడియోను షేర్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *