
Custody OTT: నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తుంది.అయితే ఈ సినిమాకు వచ్చిన టాక్ గురించి పక్కన పెడితే అక్కినేని అభిమానులు మాత్రం మరోసారి బాధపడుతున్నారు.గత కొన్ని రోజుల నుంచి అక్కినేని హీరోలకు అస్సలు కలిసి రావటం లేదు అనే సంగతి అందరికి తెలిసిందే.నాగార్జున,నాగచైతన్య,
మొదటి రోజు ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటిటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఆసక్తికరంగా మారాయి అని చెప్పచ్చు.ఇదివరకటి రోజుల్లో ఏదైనా సినిమా థియేటర్లో వచ్చిన తర్వాత టీవీ లో ఎప్పుడు ప్రసారం అవుతుంది అని అభిమానులు ఎదురు చూసేవారు.కానీ ఇప్పుడున్న రోజుల్లో నెల నెలన్నర రోజుల్లోనే సినిమా ఓటిటీ లో రిలీజ్ అవుతుంది.
దాంతో కొత్త మూవీ థియేటర్ లో రిలీజ్ అయినా తర్వాత ఓటిటీ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రేక్షకులకు తెలిసిపోతుందని చెప్పచ్చు.సినిమా టాక్ ను బట్టి ఓటిటీ రిలీజ్ ను అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు.ప్రస్తుతం కస్టడీ ఓటిటీ పార్టనర్ ఫిక్స్ అవ్వడంతో ఓటిటీ రిలీజ్ ఎప్పుడు అనేది అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు.ఈ సినిమా ఓటిటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్ సొంతం చేసుకుందని సమాచారం.జూన్ మొదటి లేదా రెండవ వారంలో ఈ సినిమా ఓటిటీ లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.