డార్లింగ్ సినిమాలో కాజల్ తమ్ముడుగా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు…

ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరో,హీరోయిన్ గా ఎదిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు.బేబీ షాలిని,బేబీ షామిలి,తరుణ్,మీనా,శ్రీదేవి ఇలా చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా తమ కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత స్టార్ హీరో,హీరోయిన్లుగా ఎదిగారు.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇండస్ట్రీ ఏదైనా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో హీరోయిన్ లుగా ఎదిగినా వాళ్ళు ఉన్నారు.హీరోగా లేదా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ హీరో..ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడు కదా…అని ఆశ్చర్య పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుని హీరోగా ఎంట్రీ ఇస్తున్న వాళ్లలో గౌరవ్ కూడా ఒకడు.ఈ గౌరవ్ ఎవరో కాదు ప్రభాస్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వం వహించిన డార్లింగ్ సినిమాలో హీరోయిన్ కాజల్ కు తమ్ముడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గౌరవ్.హీరోయిన్ కు తమ్ముడిగా హీరోను ఆటపట్టించే గౌరవ్ పాత్ర ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తుండే ఉంటుంది.డార్లింగ్ సినిమాకు ముందు గౌరవ్ పలు స్టేజి షో లలో,డాక్యుమెంటరీ లోను నటించడం జరిగింది.అలాగే రవితేజ,అనుష్క జోడిగా నటించిన బలాదూర్ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు గౌరవ్.

Darling Movie Child Artist
Darling Movie Child Artist

ఇరవై కి పైగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గౌరవ్.ప్రస్తుతం నూనూగు మీసాలు,ట్రెండీ లుక్ తో ఉన్నాడు గౌరవ్.గౌరవ్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు.ఈ క్రమంలో హీరో అవ్వడం తన లక్ష్యమని ప్రయత్నాలు కూడా చేస్తున్నానని తెలిపాడు గౌరవ్.మరి హీరోగా గౌరవ్ ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తాడో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *