టాలీవుడ్, బాలీవుడ్ కోలీవుడ్ ఏ వుడ్ అయినా హీరోయిన్ల కెరీర్ పది సంవత్సరాలు కు మించి ఉండదనడంలో సందేహం లేదనే చెప్పాలి. ఇందులో కొందరు పక్కా ప్రణాళిక వేసుకుంటూ లైఫ్ లో కూడా సెటిలవుతారు. మరికొందరు కెరీర్ స్ర్టాటింగ్ లో మంచి హిట్ల ఇచ్చి తర్వాత తెరమరుగవుతూ ఉంటారు. గతంలో సావిత్రి లాంటి మహానటులకు కూడా కెరీర్ చివరి దశలో సరైన అవకాశాలు రాక, హిట్లు పడక ఇబ్బందులు పడ్డారు. నటీ మణులకు ఇది మామూలే.. అలా దాదాపు కనుమరుగైన హీరోయిన్ దీక్షాసేత్. అందంతో పాటు అభినయంతో అలరించిన ఈ హీరోయిన్ సినీ అభిమానులను ఎంతగానో అలరించింది.
‘వేదం’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది దీక్షాసేత్. దీక్షా ప్రముఖ మోడల్ కూడా. వేదంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అవకాశాలు కూడా వచ్చాయి. తర్వాత ‘మిరప కాయ్’, ‘వాంటెడ్’ ‘బంగారం’ తదితర సినిమాలు చేసినా కొన్నింటిలో ఆమె నటనకు గుర్తింపు వచ్చిందే కానీ చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించలేకపోయాయి. తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లిన దీక్షా ఒక సినిమాలో నటించింది. అధికూడా ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ తర్వాత కాలగమనంలో మంచి అవకాశాలు లేక ఈ ముద్దుగుమ్మ వెనుకబడింది.

వెండితెర ఆమెను మరిచిపోయింది అనుకున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా కొత్త కొత్త గెటప్ లతో ఉన్న ఫొటోలు చేసింది. రీసెంట్ గా ఆమె బీచ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి అభిమానులు సైతం వాటిని చూసి తెగ మురిసిపోతున్నారు. ఈమె దీక్షా సేతేనా అంటూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారంట.