Childhood Pic: ఈ ఫొటోలో ఉన్న పాన్ ఇండియా హీరోయిన్ ఎవరో చెప్పగలరా…పెళ్లి తర్వాత కూడా ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి..!

NEWS DESK
2 Min Read
Deepika Padukone

Childhood Pic: ఈ చిన్ననాటి ఫొటోలో క్యూట్ గా ముద్దుగా ఉన్న చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరోయిన్.ఈమె మలయాళం లో తప్పించి మిగిలిన అన్ని భాషలలో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.పాన్ వరల్డ్ యాక్ట్రెస్ గా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.స్టార్ హీరోలతో పాటు యంగ్ స్టార్స్ కు జోడిగా కూడా నటించి తన నటనతో అందరిని కట్టిపడేసింది ఈ చిన్నది.తన హాట్,గ్లామర్,పెర్ఫార్మన్స్,సొట్ట బుగ్గలతో ఉన్న ఈ సుందరి ప్రతి భాషలోనూ నటించి మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.సాధారణంగా అయితే హీరోయిన్లకు పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు రావు అని చెప్పాలి.

కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం పెళ్లి తర్వాత కూడా క్రేజీ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతుంది.ఈ చిన్ననాటి ఫొటోలో ముద్దులొలికిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో కాదు దీపికా పదుకొనె.దీపికా ఐశ్వర్య అనే కన్నడ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కు జోడిగా ఓం శాంతి ఓం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.ఆ తర్వాత బాలీవుడ్ లో బచ్నా ఏ హసీనా,లవ్ ఆజ్ కల్,హౌస్ ఫుల్,చెన్నై ఎక్ష్ప్రెస్స్,రామ్ లీల,హ్యాపీ న్యూ ఇయర్,పీకు,పద్మావతి,పఠాన్ ఇలా పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇక తమిళ్ లో దీపికా సూపర్ స్టార్ రజని కాంత్ నటించిన త్రీడి యానిమేటెడ్ పిరియడ్ యాక్షన్ ఫిలిం కొచ్చడయాన్ లో ప్రిన్సెస్ వందన దేవి గా నటించడం జరిగింది.దీపికా నటించిన ఒకే ఒక తమిళ్ సినిమా ఇది అని చెప్పచ్చు.దీపికా హాలీవుడ్ మూవీ అయినా రిటర్న్ ఆఫ్ క్సాన్డెర్ కేజ్ లో కూడా నటించడం జరిగింది.ఇక ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడిగా కల్కి 2898 AD తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతుంది.ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్,టైటిల్ గ్లిమ్స్ లో దీపికా పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *