దీపికా పిల్లి ఈ పేరు తెలుగు ప్రేక్షకులు వినే ఉంటారు.రీల్స్,టిక్ టాక్ వీడియోలతో ఈమె మంచి క్రేజ్ ను మరియు పాపులారిటీని సంపాదించుకుంది.బుల్లితెర మీద కూడా కామెడీ షో కు యాంకర్ గా మరియు రియాలిటీ షో కు టీం లీడర్ గా చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ అమ్మడు.ఇక ఆ తర్వాత ఆ క్రేజ్ తోనే ఈ అమ్మడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వాంటెడ్ పండుగాడు అనే సినిమా లో హీరోయిన్ గా నటించడం జరిగింది.దీపికను రాఘవేంద్ర రావు గారు తన దైన స్టైల్ లో ఎంతో గ్లామర్ గా చూపించారు అని చెప్పచ్చు.
అయితే ఈ సినిమా మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే వీడియొ లు కానీ,ఫోటోలు కానీ ఎంతలా వైరల్ అవుతాయో అందరికి తెలిసిందే.తాజాగా ఈమె మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.
పొట్టి గౌనులో ఈమె సముద్రపు అందాలను ఆస్వాదిస్తున్న వీడియొ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ హల్ చల్ చేస్తుంది.తాజాగా ఈమె షేర్ చేసిన వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటుందని చెప్పచ్చు.కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో ఆక్టివ్ గా లేని దీపికా స్మాల్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ వీడియోతో అందరిని మెస్మరైజ్ చేస్తుంది.
View this post on Instagram