Home సినిమా నాటు నాటు పాటకు తమదైన స్టైల్ లో డాన్స్ ఇరగదీసిన దీప్తి సునైనా,అలేఖ్య హారిక…వీడియొ వైరల్…

నాటు నాటు పాటకు తమదైన స్టైల్ లో డాన్స్ ఇరగదీసిన దీప్తి సునైనా,అలేఖ్య హారిక…వీడియొ వైరల్…

0

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరిలోని టాలెంట్ బయట ప్రపంచానికి కనిపిస్తుంది.టిక్ టాక్,యు ట్యూబ్ వంటి సామజిక మాధ్యమాల ద్వారా చాల మంది స్టార్ హోదాను సంపాదించుకున్నారు.అలా ఫేమస్ అయినా వారిలో దీప్తి సునైనా,అలేఖ్య హారిక కూడా ఉన్నారు.టిక్ టాక్,యు ట్యూబ్ వీడియొ లతో తమ కెరీర్ ను మొదలు పెట్టి వీళ్లిద్దరు ఆ తర్వాత బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి స్టార్ డం ను సంపాదించుకున్నారు.వీళ్లిద్దరు మంచి డాన్సర్స్ అన్న విషయం చాల మందికి తెలిసే ఉంటుంది.

ఇటీవలే రిలీజ్ అయినా ట్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్,ఎన్టీఆర్ నాటు నాటు పాటకు డాన్స్ ఇరగదీసిన సంగతి అందరికి తెలిసిందే.తాజాగా దీప్తి సునైనా మరియు అలేఖ్య హారిక కూడా తమదైన స్టైల్ లో నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు వేశారు.ఈ రోజు మే 20 నుంచి ట్రిపుల్ ఆర్ సినిమా జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది.వాళ్లిద్దరూ ట్రిపుల్ ఆర్ అభిమానులకు ఓ కాన్సెప్ట్ ను వివరిస్తూ ఈ డాన్స్ చేసారు.

అభిమానులు ఈ నాటు నాటు సాంగ్ కు తమదైన స్టైల్ లో హుక్ స్టెప్పులు చేసి ఆ డాన్స్ ను వీడియొ తీసి అలేఖ్య హారిక,దీప్తి సునైనా,జీ 5 ఇండియా ను టాగ్ చేస్తూ ఇంస్టా గ్రామ్ లో పోస్ట్ చేయాలనీ తెలిపారు.ఈ కాంటెస్ట్ లో ముగ్గురు లక్కీ విన్నెర్స్ కు జీ 5 వారు గిఫ్ట్ అందచేస్తారని వాళ్ళు చెప్పుకొచ్చారు.ఈ కాంటెస్ట్ మే 20 నుంచి మే 27 వరకు జరగనుంది.ప్రస్తుతం వీరిద్దరూ చేసిన నాటు స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here