ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్,రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ మరియు సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు అన్న సంగతి అందరికి తెలిసిందే.ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయ్యింది.ఈ టీజర్ ను చిత్ర యూనిట్ అయోధ్యలోని సరయు నది తీరాన ఆదివారం చాల గ్రాండ్ గా రిలీజ్ చేసారు.టీజర్ రిలీజ్ అయినా కొద్దీ క్షణాలలోనే మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది.ఈ టీజర్ లో ప్రభాస్ రాముడిగా,సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా మరియు కృతి సనన్ సీత పాత్రలో కనిపించారు.
అయితే విడుదల అయినా ఈ టీజర్లో హనుమంతుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు అని చెప్పచ్చు.దర్శకుడు ఓంరౌత్ ఇప్పటి వరకు ప్రధాన పాత్రలను మాత్రమే రెవీల్ చేయడం జరిగిని.అయితే హనుమంతుడి పాత్రలో నటిస్తుంది ఎవరు అనే దాని మీద ప్రస్తుతం సోషల్ మీడియా లో బాగానే చర్చ జరుగుతుంది.

ఇక ఈ టీజర్ లో హనుమంతుడిగా కనిపించిన అతని పేరు దేవదత్త గజానన్ నాగే.ఈయన మరాఠీ సీరియల్స్ మరియు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ముఖ్యంగా ఈయన నటించిన జై మల్హర్ సీరియల్ లోని లార్డ్ కాండోబా పాత్ర ఈయన మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

వీటితో పాటు ఈయన వీర్ శివాజీ,దేవయాని,బాజీరావుమస్తాని వంటి సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక ఈయన ప్రస్తుతం భారీ బడ్జెట్ తో వస్తున్నా ఆదిపురుష్ సినిమాలో కీలక పాత్ర అయినా హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు.ప్రస్తుతం వస్తున్నా వార్తల ప్రకారం ఈ సినిమాలో అతని పాత్ర మరింత కీలకం కానుందని సమాచారం.ఇక ఈ పాత్ర కోసం దేవదత్త తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నట్లు తెలిపారు.