ధనవంతులు కావాలని అనుకుంటున్నారా..అయితే ఇంట్లో ఈ చిన్న మార్పులు చేసి చూడండి…

ప్రతి సామాన్యుడు కూడా ధనవంతులు కావాలని కళలు కంటూ ఉంటారు.తగినంత డబ్బును తమ ఖాతాలలో నిల్వ చేసుకోవాలి అని అనుకుంటారు.అందుకు శ్రయశక్తుల ప్రయత్నాలు చేసి కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు.కాని ఒక్కోసారి యెంత డబ్బు సంపాదించినా కూడా ఇంట్లో డబ్బు నిలువ ఉండదు.అలాగే వచ్చిన డబ్బు వచ్చిన విధంగా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది.ఇలా డబ్బు నిలువ ఉండకపోవడానికి కారణం వాస్తు దోషం అని నిపుణులు సూచిస్తున్నారు.

మన ఇంట్లో ని వస్తువులు పాజిటివ్ ఎనర్జీ ని కలిగించేవి గా ఉండాలి.అలాగే మన ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండాలి,ఎలాంటి వస్తువులు ఉండకూడదు అనేది కూడా వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.ఇంట్లో కొన్ని మార్పులు చేయడం వలన ఇంట్లో డబ్బులు నిలువ ఉంటాయి,ధనవంతులు అవుతారు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.అవి ఏంటంటే…

గణేష్ విగ్రహం:ఇంట్లో ప్రధాన ద్వారం దగ్గర రెండు వైపులా గణేష్ చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంచితే శ్రేయస్సు,ఆనందం కలుగుతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.తులసి మొక్క:ఈ మొక్క సంపద మరియు శ్రేయస్సు ను సూచిస్తుంది అని చాల మందికి తెలుసు.ఈ మొక్కను ఇంటికి ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం అని నిపుణులు సూచిస్తున్నారు.దీని  వలన ఇంట్లో సానుకూలత ఏర్పడి డబ్బు ప్రవహిస్తుందని నమ్ముతారు చాల మంది.

ఇంటి పూజ గది:ప్రతి రోజు ఇంట్లో పూజ గదిలో ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించాలి.అలాగే పూజ గదిలో లక్ష్మి దేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పెట్టుకోవాలి.కుబేర యంత్రం:కుబేరుడు సంపద శ్రేయస్సు గల దేవుడు అని వాస్తు శాస్త్రం ప్రకారం చెప్తారు.ఇంటి ఈశాన్య ములలో కుబేరుడు పాలిస్తాడు అని నిపుణులు చెప్తున్నారు.అందుకే అలాంటి ములలో టాయిలెట్లు కానీ చెప్పులు వదిలే రాక్లు కానీ పెట్టకూడదు.ఉత్తర భాగంలోని ఉత్తర గోడ పై కుబేర యంత్రాన్ని పెట్టుకోవాలి.విలువైన వస్తువులు పెట్టె లాకర్లు:ఇంట్లో విలువైన వస్తువులు,బంగారం అలాంటివి పెట్టె లకార్లను నైరుతి ములలో పెట్టుకోవాలి అని నిపుణులు చెప్తున్నారు.ఆ లాకర్ తలుపులను ఉత్తర లేదా ఈశాన్య దిశలో తెరుచుకునే విధంగా పెట్టుకోవడం వలన ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *