పొరుగు చిత్ర సీమ నుంచి టాలీవుడ్ లోకి ఎందరో తారలు వచ్చారు. అందరూ నిలదొక్కుకోలేదు. కొందరు మాత్రమే తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. అలరించడమే కాదు టాలీవుడ్ ఇండస్ర్టీలో సెటిలై ముందు వరుసలో కూడా నిలుస్తున్నారు. మలయాళీ నుంచి వచ్చి తెలుగు చిత్ర సీమపై తనకంటూ ఓ ముద్ర వేసుకుంది పూర్ణ. మలయాళీ ముద్దుగుమ్మ నటించింది కొన్ని సినిమాలే అయినా ఆ పాత్రకు తగ్గ న్యాయం చేస్తూ అందులో ఓదిగిపోయి అందరినీ మెప్పించింది. ఈ అమ్మడు ఫేమస్ డ్యాన్స్ షో ‘ఢీ’ కి కూడా జడ్జిగా వ్యవహరిస్తుంది. షోలో డ్యాన్సర్లను చూస్తూ అప్పుడప్పుడు ఆమె కూడా మంచి మంచి డ్యాన్స్ వేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది.
మలయాళీ ఇండస్ర్టీలో 2004లో అడుగుపెట్టింది పూర్ణ. ‘మంజు పోలేరు పెంకెట్టి’ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. టాలీవుడ్ లో ‘శ్రీమహాలక్ష్మి’ మూవీతో పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా.. ఆమె నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత అల్లరి ఫేమ్ హీరో నరేశ్ తో కలిసి ‘సీమ టపాకాయ్’లో నటించింది. ఇవన్నీ ఒకెత్తయితే డైరెక్టర్ రవిబాబు తీసిన ‘అవును’ మూవీ పూర్ణకు మంచి బ్రేక్ ను ఇచ్చింది. ప్రస్తుతం కళ్యాణ్ జి గుణం డైరెక్షన్ లో ‘సుందరి’ లో హీరోగా అంబటి అర్జున్ సరసన చేసింది.

ఈ మూవీ విశేషాలను ఆమె అభిమానులు, ప్రేక్షకులతో పంచుకున్నారు. సుందరి నిర్మాత రిజ్వాన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పుకచ్చింది. మంచి కథతో సాగే ఈ మూవీలో తనకంటే ఫేమస్ హీరోయిన్ ను పెట్టుకోవచ్చని కానీ రిజ్వాన్ తన నటన చూసి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఇటీవలే ఓ వ్యాపరవేత్తను వివాహం చేసుకున్నారు పూర్ణ.
డ్యాన్స్ షోలో ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆ షోలో జరుగుతున్న సన్నివేశాలపై నెటిజన్ల నుంచి వ్యతిరేఖత వస్తుండడంతో కొంచెం వరకు తగ్గించుకుంది అమ్మడు.ఇటీవల పూర్ణ చేసిన ఒక వీడియో క్లిప్ వైరల్ గా మారింది. తన అందాలను పొందికగా చూపెడుతూ నెటిజన్లను హీటెక్కించింది. వీటికి వచ్చే కామెంట్లు కూడా అదే రేంజ్ లో ఉన్నా ఆమె వాటిని పట్టించుకోవడం లేదు. సినిమాల్లో అవకాశాలు తగ్గుతుండడంతో కొంచెం ఫ్రస్టేషన్ కు గురై ఉంటుందని నెటిజన్లు అప్పుడప్పుడు గుస్సా అవుతున్నారు.