టీం ఇండియా కు అద్భుతమైన కెప్టెన్ గా మన్నలను అందుకొని టీం ఇండియా క్రికెట్ కు ఎనలేని సేవలను అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తాజాగా ధోని కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిచబోతున్నాడు.అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా మాజీ కెప్టెన్ ప్రస్తుతం సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చాడు.ఇటీవలే దీపావళి పండుగా సందర్భంగా తన సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ ను స్టార్ట్ చేసి మొదటి సినిమాను ధోని ప్రకటించడం జరిగింది.
తన సొంత ప్రొడక్షన్ ఆఫీస్ కు D ఎంటర్టైన్మెంట్ అని పేరు పెట్టాడు ధోని.చెన్నై లో ఈ ప్రొడక్షన్ ఆఫీస్ ను ధోని ప్రారంభించడం జరిగింది.అయితే ధోని మొదటి సినిమాను తమిళ్ లో నిర్మించనున్నాడు.ధోని సతీమణి అయినా సాక్షి కథను అందించడం జరిగింది.ఈ సినిమాకు రమేష్ తమిళమని దర్శకత్వం వహించనున్నారు.

ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం.అయితే గ్రౌండ్ లో బాట్ తో వీరవిహారం చేసే ధోని సినిమా రంగంలో ఎలాంటి విజయాలు సాధిస్తారో వేచి చూడాల్సిందే.ఇక ధోని సతీమణి సాక్షి రాసిన కథను చదివిన మరుక్షణమే అది ఎంతో ప్రత్యేకమైనదిగా అనిపించిందని తమిళమని చెప్పుకొచ్చారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించడానికి తాము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని తమిళమని తెలిపారు.