Dimple Hayathi: సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లను ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు.ఏదైనా గొడవలు వంటి వాటిలో ఏ హీరోయిన్ పేరైన వినిపిస్తే చాలు సోషల్ మీడియా మొత్తం వీళ్ళ గురించే చర్చించుకుంటారు.ఈ విధంగానే ఒక పోలీసుతో గొడవైన ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వారం పది రోజుల నుంచి ఈ వ్యవహారం జరుగుతున్నప్పటికీ తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది.దాంతో అందరు ఈమె గురించే చర్చించుకుంటున్నారు.
ఈమె సినిమా హీరోయిన్ గా కంటే ఈ గొడవ కారణంగా బాగా ఫేమస్ అయ్యిందని చెప్పచ్చు.ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న హీరోయిన్ విజయవాడలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి.ఈమె టీనేజ్ లో ఉన్న సమయంలోనే గల్ఫ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.ఈమె ఎవరో కాదు డింపుల్ హయతి.అభినేత్రి 2 లో ఈమె సేడ్ క్యారక్టర్ గా చేసింది.

ఈమె వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దెల కొండా గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించి అందరిని మెప్పించింది.యురేకా సినిమాలోనూ ఈమె హీరోయిన్ గా చేయడం జరిగింది.తాజాగా ఈమె రవితేజ ఖిలాడీ మరియు గోపీచంద్ రామబాణం సినిమాలో హీరోయిన్ గా నటించింది.అయితే ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.తాజాగా ఈమె తన అపార్ట్మెంట్ లో ఉంటున్న ఐపీఎస్ అధికారితో గొడవ పడటంతో ఎక్కడ చూసిన ఈమె గురించే చర్చ జరుగుతుంది.