బాలయ్య అభిమానులకు శుభవార్త…ఆ హిట్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ…

ఈ తరం హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు నందమూరి బాలకృష్ణ.ఇక ఇటీవలే బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం దర్శకుడిని ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.గత కొన్ని ఏళ్లుగా బాలయ్య సినీ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన వారసుడిగా మోక్షజ్ఞ సినిమాలో ఎంట్రీ ఇస్తారు అని చాల కాలంగా ప్రచారం జరుగుతుంది.

అయితే ఇప్పటి వరకు మోక్షజ్ఞ మొదటి సినిమాపై ఎటువంటి ప్రచారం జరగకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.బాలకృష్ణ 100 వ సినిమా అయినా గౌతమి పుత్ర శాతకర్ణి లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని అందరు భావించారు.కానీ అక్కడ కూడా అభిమానులకు నిరాశే మిగిలింది.అయితే మోక్షజ్ఞ ఎంట్రీ తప్పకుండ ఉంటుందని బాలకృష్ణ ప్రకటించి అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చారు.అయితే ఇటీవలే మోక్షజ్ఞ లాంచింగ్ ప్రాజెక్ట్ కి పూరీజగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు ఊపందుకున్నాయి.కానీ పూరీజగన్నాధ్ ఇతర సినిమా కమిట్మెంట్ లతో బిజీ గా ఉండడంతో అది కష్టమే అని తెలుస్తుంది.

Mokshagna
Mokshagna

మరోపక్క బాలయ్య తో హ్యాట్రిక్ హిట్ లు సాధించిన బోయపాటి శ్రీను మోక్షజ్ఞ ను సినిమా లాంచింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అది కూడా నిజం కాదని తెలుస్తుంది.మరోపక్క మోక్షజ్ఞ కూడా తన షేప్ ను కోల్పోయారు.గత కొంత కాలంగా తండ్రి కోరిక మేరకు మోక్షజ్ఞ జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ ఫుల్ షేప్ లోకి వచ్చారట.దాంతో త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుంది అని చెప్తున్నారు.అనిల్ రావిపూడి అయితే తన హీరో ను కామెడీ దగ్గర నుంచి ఫైట్స్ ,రొమాన్స్ అన్ని చేయిస్తూ హీరోను చాల సేఫ్ గా లాంచ్ చేయిస్తారు అని భావిస్తున్నారట.మోక్షజ్ఞ ప్రతిభను అందరు గుర్తించాలంటే అనిల్ రావిపూడి అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *