Home న్యూస్ Amrutha Chowdary: స్కంద సినిమాలో హీరో రామ్ కు చెల్లిగా నటించిన తెలుగు అమ్మాయి ఎవరో...

Amrutha Chowdary: స్కంద సినిమాలో హీరో రామ్ కు చెల్లిగా నటించిన తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా!

0
Amrutha Chowdary
Amrutha Chowdary

Amrutha Chowdary: బోయపాటి శ్రీను,రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా ఇటీవలే థియేటర్ లలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాలో హీరో రామ్ కు చెల్లెల్లిలాగా ఒక కొత్త అమ్మాయి నటించడం జరిగింది.దాంతో ఈ అమ్మాయి ఎవరో అనే దాని మీద సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో ఆరా తీస్తున్నారు నెటిజన్లు.ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ఊర మాస్ సినిమా స్కంద సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా లో రామ్ ను మునుపెన్నడూ లేని విధంగా మాస్ గా చూపించారు దర్శకుడు బోయపాటి.

ఇక ఈ సినిమా లో రామ్ కు జోడిగా శ్రీలీల,సయి మంజ్రేకర్ నటించారు.శ్రీకాంత్,ఇంద్రజ,పృథ్వీ,గౌతమి పలువురు కీలక పాత్రలలో నటించారు.స్కంద సినిమా ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు,బిసి ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది అని చెప్పచ్చు.ఈ సినిమాతో బోయపాటి తన మాసిజాన్ని డబల్ చేసుకున్నారు అని చెప్పచ్చు.ఇక రామ్ అయితే ఈ సినిమాలో ఫుల్ ఎనర్జిటిక్ గా నటించారు.దాంతో ఈ సినిమా రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని మొదటి రెండు రోజుల్లోనే 27 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో రామ్ కు చెల్లెలిగా ఒక కొత్త అమ్మాయి కనిపించింది.

సెకండ్ హాఫ్ లో ఈ అమ్మయి నిడివి కొంచెం ఎక్కువగానే ఉంటుంది.ఇక తెల్లగా,హీరోయిన్ మెటీరియల్ లాగా ఉన్న ఈ అమ్మాయి ఎవరో అని సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.అయితే ఈ సినిమాలో హీరో కు చెల్లెలిగా నటించిన అమ్మాయి భీమవరం కు చెందిన అమృత చౌదరి.అమృత చౌదరి ఇంజినీరింగ్ ను పూర్తి చేసింది.ఈమె కాలేజీ లో చదువు కుంటున్న సమయం లోనే పలు షార్ట్ ఫిలిమ్స్ లో కవర్ సాంగ్స్ లో నటించింది.ఆర్టిస్ట్ గా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో హీరో రామ్ కు చెల్లెలిగా నటించే అవకాశం దక్కించుకుంది.అమృత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో బోల్డ్ సీన్స్ కూడా చేసింది.ఇక తన హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఈ చిన్నది.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here