నరేష్ ముగ్గురు భార్యలు ఎవరో తెలుసా…నరేష్ కు యెంత మంది సంతానం అంటే…


టాలీవుడ్ నటుడు నరేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.ఇటీవలే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.వ్యక్తిగత జీవిత సమస్యలు బయటకు రావడంతో ఎక్కడ చూసిన ఆయన పెళ్లి గురించే జనం చర్చించుకుంటున్నారు.అయితే నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు…నరేష్ కు యెంత మంది సంతానం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.నరేష్ కు సినిమాలతో మంచి గుర్తింపు ఉంది.అయితే ఇటీవలే ఆయన నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తతో ఎక్కడ చూసిన కూడా ఆయన టాపికే నడుస్తుంది.

నరేష్,పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నట్లు వస్తున్నా వార్తల నేపథ్యంలో నరేష్ మాజీ ముగ్గురు భార్యలు ఎవరు..ఆయనకు యెంత మంది సంతానం అనే దానిమీద జనం ఆరా తీస్తున్నారు.చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్ ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో కూడా హీరో గా నరేష్ సినిమా చేసారు.ఇక ఈయనకు డాన్స్ మాస్టర్ శ్రీను గారి అమ్మాయితో పెళ్లి జరిగింది.

Actor Naresh Family Photos

వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.అయితే వీరిద్దరి భేదాభిప్రాయాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు.ఆ తర్వాత నరేష్ రెండవ పెళ్లి దేవులపల్లి కృష్ణ శాస్త్రి మనవరాలు రేఖ సుప్రియ ను చేసుకున్నారు.వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.వీరిద్దరికి కూడా గొడవలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు.వీరిద్దరూ విడిపోయిన కూడా ఇప్పటికి చెన్నైలోని ఒక ఎన్జీవో కోసం కలిసి పని చేస్తున్నారు.2010 లో నరేష్ రమ్యరఘుపతి కాంగ్రెస్ సీనియర్ లీడర్ రఘువీరా రెడ్డి తమ్ముడి కుమార్తె ను మూడో పెళ్లి చేసుకున్నారు.మనస్పర్థలు రావడంతో వీరు విడాకులకు దరఖాస్తు చేసారు.ఈ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు.ప్రస్తుతం నరేష్ మూడో భార్యతో దూరంగా ఉంటూ పవిత్ర లోకేష్ తో సహజీవనంలో ఉండడంతో వివాదాలు జరుగుతున్నాయి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *