వెండితెరకు ఒక్క బ్లాక్ బస్టర్ ఇస్తే ఆయన నటుడు, దర్శకుడి గురించి తెలుసుకునేందుకు సెర్చింజన్లను పరిగెత్తిస్తుంటారు ప్రేక్షకులు. ఈ కోవలోనే ఇటీవల విడుదలై విజయవంతం నడుస్తున్న ‘కాంతారా’ హీరో గురించి తెలుసుకునేందుకు గూగుల్ తల్లిని తెగ అడుగుతున్నారు నెటిజెన్లు. ఆయన ఫ్యామిలీ, చేసిన సినిమాలు తదితరాలపై జల్లడ పడుతున్నారు. మనం కూడా అటువైపు కొంచెం చూసొద్దాం రండి..
కన్నడ సినిమా ‘కాంతారా’ బాక్సాఫీస్ కలెక్షన్లను తిరగరాస్తుంది. తెలుగు, తమిళం, తదితర భాషల్లో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్ లాంటి వాటికి ధీటుగా కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పుడు ఎక్కడ నలుగురు సినీ అభిమానులు అలిసినా కాంతారా గురించే చర్చించుకుంటున్నారంటే ఈ మూవీ జనాల్లోకి ఏ మేరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. రూ. 16 కోట్లతో వచ్చిన ఈ చిన్న (బడ్జెట్ పరంగా) చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరిందంటే దాని పవర్ మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ బ్లాక్ బస్టర్ హిట్ కు డైరెక్టర్ రిషబ్ షెట్టి ఆయనే హీరోగా కూడా నటించారు. రిషబ్ ఖాతాలో మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ‘కిరిక్ పార్టీ’కి ఆయన దర్శకత్వం వహించారు. ఇలా పలు విభాగాలలో మంచి ప్రతిభ చూపుతూ వస్తున్నారు.

ఇక ఆయన పర్సనరల్ లైఫ్ లోకి తొంగిచూస్తే ప్రగతి శెట్టి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2016లో ఒక సినిమా ఈ వెంట్ లో ప్రగతిని చూసిన రిషబ్ శెట్టి ప్రేమలో పడ్డారట. సోషల్ మీడియాలో ఆమె కోసం వెతకడం ప్రారంభించారట. అనుకోకుండా ఆమే రిషబ్ కు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టారట. ఇంకేముంది కట్ చేస్తే లవ్ పుట్టింది. ప్రగతి కుటుంబ సభ్యులు మాత్రం దీనికి సమ్మతించలేదట. వారిని నచ్చజెప్పిన ప్రగతి చివరికి రిషబ్ నే మనువు చేసుకుంది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడీ జంట ఆనందంగా అన్యూన్యంగా జీవిస్తోంది.