Mahesh Babu: మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటించిన ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

NEWS DESK
1 Min Read

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు,అందాల కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సూపర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే.పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమాలో మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి సౌమ్య మీనన్ అందరికి గుర్తుండే ఉంటుంది.సౌమ్య మోడలింగ్ నుంచి నటిగా మారింది.సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఎలాగైనా నటించాలి అనే ఉద్దేమాసంతో ఈ అమ్మడు సర్కారు వారి పాట సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.

సౌమ్య ఈ సినిమాలో నటించింది చిన్న పాత్రలో అయినా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది.సౌమ్య మలయాళంలో కిణవల్లి,ఫాన్సీ డ్రెస్,చిల్డ్రన్స్ పార్క్ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించి అక్కడ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.త్వరలోనే సౌమ్య కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది ఈ బ్యూటీ.సర అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో సౌమ్య నటించనుంది.

శశిభూషణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో సౌమ్య అలరించనుంది.సోషల్ మీడియాలో సౌమ్య ఆక్టివ్ గా ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.సౌమ్య నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ అని కూడా తెలుస్తుంది.ఈమె మలయాళంలో ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Sowmya Menon (@sowmyamenon_)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *