Sreeleela: హీరో యశ్ శ్రీలీల కు బావ అవుతారు…ఈ రిలేషన్ వెనుక ఉన్న ఇంటరెస్టింగ్ స్టోరీ ఏంటో తెలుసా.!

Sreeleela

Sreeleela: రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయినా యంగ్ హీరోయిన్ శ్రీలీల.మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది శ్రీలీల.ఆ తర్వాత రవితేజ హీరో గా చేసిన ధమాకా సినిమాతో శ్రీలీల బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.ఆ తర్వాత వరుస అవకాశాలు శ్రీలీల కు క్యూ కట్టడంతో ప్రస్తుతం ఆమె క్షణం తీరిక లేకుండా బిజీ గా ఉంది.శ్రీలీల నటించిన సినిమాలు నెలకు ఒకటి రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.రామ్ పోతినేని కు జోడిగా శ్రీలీల నటించిన సినిమా సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఆ తర్వాత శ్రీలీల బాలయ్య తో కలిసి నటించిన భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కెజిఎఫ్ హీరో యశ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.యశ్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉన్నాయి.ఇక యశ్ కెజిఎఫ్ 2 తర్వాత మరొక ప్రాజెక్ట్ ప్రకటించకపోవడంతో ఆయన అభిమానులు ఆయన తరువాతి సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు.యంగ్ బ్యూటీ శ్రీలీల వరుసగా అగ్ర హీరోల సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.అందంతో పాటు సూపర్ డాన్స్,నికార్సైన నటనతో ఇండస్ట్రీలో దర్శకుల ఫస్ట్ ఛాయస్ గా మారింది శ్రీలీల.

Sreeleela

శ్రీలీల యశ్ ను బావ అని పిలుస్తుంది అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చమ్సానియం గా మారింది.వీరిద్దరి మధ్య బంధుత్వం లేదు కానీ శ్రీలీల అలా పిలవడం వెనుక ఒక ఇంటరెస్టింగ్ స్టోరీ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.శ్రీలీల తల్లి స్వర్ణలత కు బెంగళూరు లో డాక్టర్ గా మంచి పేరు ఉంది.ఇక హీరో యశ్ వైఫ్ రాధికా ఆమె దగ్గరకు తరచూ వెళ్తూ ఉండేవారట.అలా హీరో యశ్ కుటుంబం తో శ్రీలీల కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.దాంతో శ్రీలీల హీరోయిన్ అవ్వకముందు నుంచే యశ్ భార్య ను అక్క అని పిలిచేది.అలా యశ్ ను బావ అని పిలిచేడి శ్రీలీల.ఇక బయట శ్రీలీల అలా పిలవక పోయిన ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మాత్రం బావ అని పిలుస్తుందని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *