Rathika Rose: టీవీ లో ప్రసారం అయ్యే ప్రముఖ బుల్లితెర షో బిగ్ బాస్ కు ఉన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయ్యి నాలుగు వారలు గడిచిపోయాయి.ఇక నాలుగవ వారం లో ఆరుగురు నామినేట్ అయితే అందులో చివరి రెండు స్థానంలో తేజ మరియు రతికా రోజ్ నిలిచారు.ఇక అందరు అనుకున్నట్లు గానే నాలుగవ వారంలో రతికా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేటి అయ్యి బయటకు వచ్చేసింది.ఒక్కప్పుడు టైటిల్ ఫేవరేట్ గా భావించిన రతికా సడన్ గా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.ఇక అదంతా తాను చేతులారా చేసుకున్నదే అని అందరు భావిస్తున్నారు.
ఒక పక్క తన ప్రవర్తనకు తోడు ఓట్లు తక్కువగా రావడం రతికా ఎలిమినేషన్ కు కారణం అని చెప్పచ్చు.ఆదివారం బిగ్ బాస్ షో లో నాగార్జున రతికా ఎలిమినేట్ అని చెప్పగానే నేను ఎలిమినేట్ అవ్వడం కల లాగ ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రతికా.అయితే నాలుగు వారాలకే బయటకు వచ్చేసిన రతికా రెమ్యూనరేషన్ గట్టిగానే ఉందని తెలుస్తుంది.రతికా పారితోషకం రోజు కు 28 వేలు,వారానికి 2 లక్షలు చొప్పున నాలుగు వారాలకు 8 లక్షలు అందుకుంది అని సమాచారం.నాలుగు వారాలకే ఎలిమినేట్ అయినా కూడా రతికా రెమ్యూనరేషన్ గట్టిగానే అందుకుంది తెలుస్తుంది.

బిగ్ బాస్ 7 వ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి వెళితే ఇప్పటికే నాలుగు కంటెస్టెంట్ లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు.అయితే షో స్టార్టింగ్ లో రతికా తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంది.ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ తో ప్రేమగా ఉంది.కానీ అదంతా గేమ్ లోని భాగమే అని త్వరగానే అందరికి తెలిసిందే.ఆ తర్వాత మల్లి ప్రిన్స్ యావర్ తో ప్రేమగా మాట్లాడిన రతికా మల్లి అతనితో కూడా గొడవ పెట్టుకుంది.ఇలా రతికా తన ప్రవర్తనతో హౌస్ లో ఉన్నా వాళ్ళకే చిరాకు తెప్పించింది.దాంతో ఈ సారి నాలుగవ వారంలో రతికా ఎలిమినేట్ అవుతుంది అని అందరు భావించారు.ఇక అందరు ఊహించినట్లు గానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది రతికా.