సీరియల్స్ లో నటించేటప్పుడు కట్టుకునే చీరలు ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసా…!

Telugu serials Actress Saree

తెలుగు, హిందీ, కన్నడ ఇలా భాష ఏదైనా సీరియళ్లన్నీ ఒక్కటే.. మహిళలను టీవీల ముందు నుంచి కదలనీయకుండా కట్టి పడేస్తుంటాయి. ఇక తెలుగు ప్రేక్షకులను ఈ టీవీ, జెమినీ, జీ టీవీ, మా టీవీ కు అడెక్ట్ చేస్తాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే బుల్లి తెర నటీమణులు వాడే చీరల గురింది. చర్చిద్దాం రండి..వెండితెరకు తగ్గకుండా బుల్లి తెర ఇప్పుడు క్రేజ్ తెచ్చుకుంది. ఓటీటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఇక సినిమాలకు వెళ్లడం మానేసారు సాధారణ ప్రేక్షకులు, సినీ అభిమానుల మాట వేరనుకోండి. ఇక ఇంటిపట్టునే ఉండే గృహిణిలు ఉదయం నుంచి తమ దైనందిన పనులు చేసుకుంటూ ఏదో ఒక సీరియల్ చూస్తూనే ఉంటారు. రాత్రి కొంచెం పని తక్కువ ఉంటుందని కాబట్టి ఎక్కువ కాన్సన్ ట్రేషన్ చేస్తుంటారు. ఇలా రోజు వారిలో వారు  దాదాపుగా 6 టీవీ సిరియళ్లకు పైగా చూస్తారని ఒక సర్వే కూడా చెప్పడం విశేషం. 

వెండితెరలో కాస్టూమ్స్ విషయంలో కొంచెం వరకు డైరెక్టర్లు అటూ ఇటూగా వ్యవహరించినా దానికి సరిసమానమైన బుల్లి తెర నటీమణుల కాస్టూమ్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. వారు కట్టుకునే చీరలను దాదాపుగా వారే సెలక్ట్ చేసుకుంటారు. కొంత మంది మేయిన్ యాక్టర్స్ కు మాత్రం డైరెక్టర్ సూచనల మేరకు కాస్టూమ్ డిజైన్ చేయాలి వస్తుంది. దీని వల్ల నిర్మాతలకు వాచిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ జామానాలో కాస్టూమ్స్ విషయంలో అంతగా శ్రద్ధ పెట్టకపోయినా ప్రస్తుతం 4కే జమానాలో ఇది తప్పడం లేదు. తమ సీరియల్ నటీమణులను కూడా అంతే అందంగా చూడాలనుకుంటున్నారు గృహిణులు. 

Telugu Serials

ఈ విషయాలన్నీ పక్కన పెడితే సీరియల్స్ లో నటించే నటీమణులు కాస్టూమ్స్ విషయంలో ఎక్కువగా శ్రద్ధ పెడతారని తెలుస్తోంది. వారు కట్టుకునే చీరలను వారే సొంతంగా తెచ్చుకుంటారట. క్యారెక్టర్ డిమాండ్ ను బట్టి ప్రొడక్షన్ ఎలాగో ప్రొవైడ్ చేయక మానదు. ఒక వేళ ప్రొడక్షన్ చీరలు ఇవ్వలేకుంటే వారే సొంత చీరలను తెచ్చుకుంటారట. సీరియల్స్ ను ఎక్కువగా ఫాలో అయ్యే గృహిణిలు ఏ చీర ఎప్పుడు కట్టారో, ఏ సీన్ లో కట్టారో ఇట్టే గుర్తు పడతారు కాబట్టి వాటినే మార్చి మార్చి 10, లేదా 20 ఎపిసోడ్స్ గ్యాప్ ఇచ్చి కడుతుంటారు. ఈ విధంగా చేస్తే మహిళలు గుర్తు పట్టరని అనుకుంటారో ఏంటో.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *