Actress: 15 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.!

NEWS DESK
2 Min Read

Actress: చాల మంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అలాగే చిన్న వయస్సులోనే హీరో,హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాల మందే ఉన్నారు.దాదాపు స్టార్ హీరోలందరికీ జోడిగా నటించి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న ముద్దుగుమ్మర్లు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు.ప్రస్తుతం పైన ఉన్న ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఈ కోవకు చెందిందే అని చెప్పచ్చు.ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరికీ జోడిగా నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

అన్ని భాషలలోను వరుస సినిమా అవకాశాలతో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ బ్యూటీ ఎవరో కాదు హీరోయిన్ రంభ(Rambha).తెలుగు,తమిళ్,హిందీ,కన్నడ,మలయాళం ఇలా అన్ని బాషలలో 100 కు పైగా సినిమాలలో నటించి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఏలింది.

Rambha Childhood
Rambha Childhood

చిన్న వయస్సులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.హీరో వినీత్ కు జోడిగా స్వర్గం అనే మలయాళం సినిమాతో 1992 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రంభ.స్వర్గం సినిమాలో నటించేటప్పుడు ఆమె వయస్సు కేవలం 15 ఏళ్ళు మాత్రమే.ఆ తర్వాత రంభ 1993 ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

Also read : అలా అనడంతో…ఆ హీరోయిన్ లతో నన్ను పోల్చకండి అంటున్న శృతిహాసన్

Rambha
Rambha

ఇక ఆ తర్వాత తెలుగు లో పలు సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా అలరించింది.అలాగే పలు స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించింది రంభ.ఇక తాజాగా రంభ కెరీర్ ప్రారంభంలో కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.కెనడా కు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్ పద్మనాభన్ ను 2010 లో పెళ్లి చేసుకుంది రంభ.ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు ఉన్నాడు.రంభ ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *