ఒక వ్యక్తి తానూ చూపించిన డెడికేషన్ కి రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు అని చెప్పచ్చు.ఆ వ్యక్తి కదులుతున్న రైలును ఛేజ్ చేసి మహిళకు వస్తువు డెలివరీ చేసిన వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.రకరకాల వస్తువులను హోమ్ డెలివరీ చేసే డాంజో ఏజెంట్ రన్నింగ్ లో ఉన్న ట్రైన్ ను ఛేజ్ చేసి ఒక మహిళకు ఆ వస్తువును డెలివరీ చేసాడు.ఆర్డర్ చేసిన మహిళా కస్టమర్ ఆ వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్లుగా ఆ వ్యక్తి ఆనందం వ్యక్తం చేసాడు.ఈ ఘటన ముంబై లో జరిగిన్నట్టు సమాచారం.
ఈ వీడియొ లో డాంజో డెలివరీ బాయ్ స్టేషన్ లో పరుగెత్తుతూ వెళ్లడం గమనించవచ్చు.ప్లేట్ ఫారం పై రైలు నెమ్మదిగా కదలడం మొదలైంది.ఆ తర్వాత రైలు వేగం పెరిగింది.సరిగ్గా అప్పుడే డంజో డెలివరీ బాయ్ ప్లేట్ ఫారం పైకి వచ్చాడు.కదులుతున్న రైలు లో డోర్ దగ్గర నిలపడి ఉన్న మహిళా కస్టమర్ ఆ డెలివరీ బాయ్ ని ఫాస్ట్ ఫాస్ట్ అంటూ సైగలు చేసింది.
దాంతో అతను వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ మహిళా కస్టమర్ కు తన చేతిలో ఉన్న వస్తువుల బాగ్ ను అందించాడు.ఆ వస్తువును అందుకున్న మహిళా తన సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా వీడియొ లో గమనించవచ్చు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియొ ను చూసిన నెటిజన్లు ఆ డెలివరీ బాయ్ కి ప్రమోషన్ ఇవ్వాలని..అతనికి పది రేట్లు ఎక్కువగా టిప్ ఇవ్వచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు.
Just Came Across This Viral Video. His Dedication Is Really Amazing! #DDLJ #TrendingReels #SRK #Dunzo @DunzoIt @iamsrk @itsKajolD pic.twitter.com/GfGp0zmQLF
— Prathamesh Avachare (@onlyprathamesh) September 15, 2022