శనివారం వేదికపై పాట పాడుతూ ఒక్కసారిగా ప్రముఖ మలయాళ నేపథ్య గాయకుడూ ఏడవ బషీర్ గుండెపోటుతో కన్నుమూశారు.బషీర్ మే 28 న అలప్పుజాలో జరిగిన బ్లు డిమాండ్ ఆర్కెస్ట్రా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా లైవ్ ప్రదర్శన ఇస్తుండగా స్టేజి పైనే కుప్పకూలిపోయారు.బషీర్ ప్రముఖ గాయకుడూ ఏసుదాసు పాడిన మానో హోం తుమ్ అనే హిందీ పాటను పడుతుండగా ఛాతిలో నొప్పి తో అక్కడే కింద పడిపోయారు.వెంటనే బషీర్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు చెప్పడం జరిగింది.
బషీర్ తన స్కూల్ రోజుల నుంచే పాటలు పాడుతూ ఎన్నో అవార్డులు,బహుమతులను అందుకున్నారు.బషీర్ తిరువనంతపురం జిల్లాలోని వర్కాలలో సంగీతాలయ అనే స్కూల్ ను కూడా ప్రారంభించడం జరిగింది.బషీర్ యునైటెడ్ స్టేట్స్,యునైటెడ్ కింగ్ డమ్,యూరోపియన్ దేశాలు,మిడిల్ ఈస్టర్న్ దేశాలు,ఫార్న్ ఈస్టర్న్ దేశాలలో తన పాటలను ప్రదర్శన ఇచ్చారు.

బషీర్ అకడమిక్ డిగ్రీ నాగభూషణం స్వాతి తిరుణాల్ మ్యూజిక్ అకాడెమీ నుంచి అభ్యసించారు.మొదటి సారిగా నేపథ్య గాయకుడిగా రఘువంశం అనే సినిమాతో పరిచమయ్యారు బషీర్.ఆల్ కేరళ మ్యూజిషియన్స్ అండ్ టెక్నీషియన్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా భాధ్యతలు కూడా నిర్వహించారు బషీర్.కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్,ప్రతి పక్ష నేత విడి సతీషన్ ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
Warning: Disturbing Content
Singer dies during live performance.
Malayalam singer #EdavaBasheer died after collapsing on the stage while singing.
The 78-year-old was performing at the Golden jubilee of Blue Diamonds orchestra. pic.twitter.com/k6CCfhafjO— Bobins Abraham Vayalil (@BobinsAbraham) May 29, 2022