చాల మంది తమ ఇండ్లలో కొన్ని నమ్మకాలను బాగా విశ్వసిస్తారు.అయితే చాల మంది తమ ఇంట్లో ఏదైనా శుభకార్యం అనుకున్నప్పుడు అద్దం పగిలిపోవడం,నల్ల పిల్లి ఎదురు రావడం అలాగే దేవుడు దగ్గర వెలుగుతున్న దీపం ఆరిపోవడం వంటివి జరిగితే అది చెడుకు సంకేతం అని నమ్ముతారు.ఇలా ప్రతిఒక్కరు ఏదో ఒక నమ్మకాన్ని విశ్వసిస్తారు.అలాగే ఆచార్య చాణుక్యుడు నీతి శాస్త్రం గురించి చాల మందికి తెలుసు.ఆయన తన నీతి శాస్త్రంలో చాల విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది.అందులో ఒకటి ఆర్ధిక ఇబ్బందులు రాబోయే ముందు ఇంట్లో కొన్ని సంకేతాలు కనిపిస్తాయట.
తన నీతి శాస్త్రంలో ఆచార్య చాణుక్యుడు ఆర్ధిక సమస్యలు రాబోయే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అని చెప్పారు.ఆ లక్షణాలు ఏంటంటే…హిందువుల ప్రతి ఇంటిలోనూ తులసి మొక్క అనేది తప్పకుండ ఉంటుంది.ఒకవేళ ఉన్నట్టుండి తులసి మొక్క ఇంకి పొతే ఆర్ధిక ఇబ్బందులు తలెత్తనున్నాయి అని అర్ధం.అప్పుడు వెంటనే ఆ మొక్కను తీసేసి మరో మొక్కను నాటాలి.అలాగే ఇంట్లో ఉన్నఫళంగా గాజు వస్తువులు కానీ అద్దం గాని మిగిలిపోతే ఆర్ధిక సమస్యలు తలెత్తనున్నాయని సంకేతం.
అందుకే అలా పగిలిన వస్తువులు ఏవైనా ఉంటె వెంటనే వాటిని బయట పడేయాలి.ఎప్పుడు తరచూ గొడవపడే వారి ఇంట్లో లక్ష్మి దేవి ఉండటానికి ఇష్టపడదు.అలాంటి వారి ఇంట్లో ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి.ఇంట్లో తల్లితండ్రులను కానీ వృద్ధులను కానీ అవమానపరిచే ఇంట్లో లక్ష్మి దేవి ఉండటానికి ఇష్టపడదు.అలాంటి వారి ఇంట్లో కూడా ఆర్ధిక సమస్యలు ఏర్పడతాయి.దీపారాధన చేయని వారి ఇంట్లో కూడా లక్ష్మి దేవి ఉండటానికి ఇష్టపడదు.దాంతో ఆర్ధిక సమస్యలు ఏర్పడతాయి.