సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాల చిన్న వయస్సు ఉన్న వారిలో కూడా తెల్ల జుట్టు వచ్చేస్తుంది.చిన్న చిన్న వయస్సు ఉన్న వారిలో కూడా జుట్టు తెల్లగా మారిపోవడం చాల ఎక్కువగా ఉన్న సమస్య.ఇలా తెల్ల జుట్టు రావడం వలన చాల మంది బయట మార్కెట్ లలో దొరికే వివిధ రకాల హెయిర్ డై లను ఉపయోగిస్తూ ఉన్నారు.అలా వాడటం వలన జుట్టు రాలిపోయే సమస్య ఏర్పడుతుంది.అలా కాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే కొన్ని ఈజీ చిట్కాలు పాటించి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.ఉసిరికాయలు గురించి అందరికి తెలిసే ఉంటుంది.
తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఉసిరికాయలు చాల ఉపయోగపడతాయి.దాని కోసం ఏం చేయాలంటే…కొన్ని ఉసిరి ముక్కలను పాన్ లో తీసుకోని సిం లో పెట్టి ఒక అయిదు నిమిషాల పాటు వేయించాలి.ఆ తర్వాత అదే పాన్ లో కొన్ని నీళ్లు పోసి ఆ ఉసిరి ముక్కలను మరిగించాలి.ఇలా ఉసిరి ముక్కలు మరగడానికి దాదాపుగా ఏడు నిమిషాల సమయం పడుతుంది.అలా బాగా ఉడికిన ఉసిరి ముక్కలను రాత్రంతా అలాగే ఉంచేయాలి.ఆ తర్వాతి రోజు ఉదయం బాగా ఉడికిన ఉసిరి ముక్కలను మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.
ఆ ఉసిరి ముక్కల పేస్ట్ లో ఒక స్పూన్ గోరింట పొడి మరియు ఒక అరస్పూన్ కాఫీ పొడిని వేసి బాగా కలపాలి.ఇలా కలిపినా మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి.ఇలా క్రమం తప్పకుండ వారంలో రెండు సార్లు చేసినట్లయితే తెల్లగా ఉన్న జుట్టు మెల్లగా నల్లగా మారుతుంది.ఈ చిట్కాలు పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లగా ఉన్న జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.ఎక్కువ తెల్ల జుట్టు ఉన్న వారికీ ఎక్కువ వారలు పడుతుంది.అదే తక్కువ తెల్ల జుట్టు ఉన్న వాళ్లకు జుట్టు నల్లగా మారడానికి తక్కువ వారలు పడుతుంది.