అల్లరి చేస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా…ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్ళ మనసు దోచిన స్టార్ హీరోయిన్…

Eesha Rebba Childhood pic
Eesha Rebba: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావడం అనేది చాల అరుదు.తెలుగు అమ్మాయిలకు సినిమా అవకాశాలు అరకొరగా తప్పించి పెద్దగా రావు అని చెప్పచ్చు.అలా వచ్చిన సినిమా అవకాశాలను సద్వినియోగం చేసుకొని టాలీవుడ్ లో స్థిరపడిపోయిన హీరోయిన్లు కొంత మంది ఉన్నారు.ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పటి అందాల తార ఇషా రెబ్బ.ఈమె తెలుగుతో పాటు తమిళ్,మలయాళంలో కూడా హీరోయిన్ గా చేసింది.

ప్రస్తుతం ఈమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.వరంగల్ లో పుట్టిన ఇషా రెబ్బ పది సంవత్సరాల క్రితమే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Advertisement

ఆమె కెరీర్ ప్రారంభం లో పలు యాడ్స్ లో కూడా నటించింది.శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో కనిపించింది ఈ అమ్మడు.తెలుగులో ఇషా అంతకు ముందు ఆ తర్వాత,అ !,సుభ్రమణ్యపురం,బందిపోటు,దర్శకుడు,అమితుమీ వంటి పలు సినిమాలలో హీరోయినిగా నటించడం జరిగింది.

Eesha Rebba

ఇక ఎన్టీఆర్,పూజ హెగ్డే జంటగా నటించిన అరవింద సమేత సినిమాలో పూజ హెగ్డే అక్కగా నటించి అందరిని ఆకట్టుకుంది.సినిమాలలో స్టార్ గా మాత్రం ఫెమ్ తెచ్చుకోలేకపోయింది ఈ అమ్మడు.

Eesha Rebba

ఇక ఈమె త్రి రోజెస్,పిట్టకథలు వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.ఇషా రెబ్బ హీరో రాజశేఖర్ కూతుర్లు అయినా శివాత్మిక,శివాని లకు మంచి ఫ్రెండ్.సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే ఇషా తన లేటెస్ట్ ఫోటోలు మరియు రీల్స్ లతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *