పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3 .ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు.ఇక తమన్నా మరియు మెహ్రిన్ వాళ్ళిద్దరికీ భార్యలుగా నటించారు.ఫుల్ కామెడీ తో నవ్వుల ఆటంబాంబ్ గా ఈ చిత్రం మే 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎఫ్ 2 చిత్రంలో భార్య భర్తల మధ్య ఉండే ఫ్రస్ట్రేషన్ ను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు దర్శకుడు.
ఇక ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమాలోని పాత్రలు అవే అయినప్పటికీ కథ కొత్తగా ఉంటుంది ఫుల్ కామెడీ ఉంటుంది అంటూ అనిల్ రావిపూడి అందరిలోనూ ఆసక్తిని కలిగించారు.అయితే ఎఫ్ 3 చిత్రం కోసం నటి నటుల పారితోషకం యెంత ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఎఫ్ 2 చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఎఫ్ 3 చిత్రానికి నటి నటుల పారితోషకం ఎక్కువే ఉంటుంది అని అందరు అంచనాలు వేస్తున్నారు.సీనియర్ హీరో వెంకటేష్ ఈ చిత్రానికి 15 కోట్లు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.ఇక వరుణ్ తేజ్ 13 కోట్లు,మిల్కీ బ్యూటీ తమన్నా 1 .8 కోట్లు,మెహ్రిన్ 80 లక్షలు రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం.ఫుల్ కామెడీ కాన్సెప్ట్ తో తెరెకెక్కబడిన ఈ చిత్రం కామెడీ ని ఇష్టపడేవారికి బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.