2019 లో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ఎఫ్ 3 .కామెడీ కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రంలో వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా,తమన్నా,మెహరీన్ హీరోయిన్లుగా నటించారు.ఇక ఈ చిత్రంలో సునీల్,మొరళి శర్మ,ప్రగతి,రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం మరియు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.ఇక ఈ సినిమా ఎలా ఉందంటే…

కథ:డబ్బు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు.లోకంలో పంచభూతాలతో పాటు డబ్బు అనే కోణం కూడా ఉంటుంది అంటూ ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు.ఈ చిత్రంలో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లలో ఒకరు రేచీకటితో మరియు ఒకరు నత్తితో భాధపడుతుంటారు.వెంకటేష్,వరుణ్ తేజ్ లకు భార్యలుగా తమన్నా,మెహ్రిన్ నటించారు.వీరిద్దరికి డబ్బు మీద చాల ఆశ ఉంటుంది.ఇక డబ్బు సంపాదించడం కోసం వెంకటేష్,వరుణ్ తేజ్ పడే పాట్లు కామెడీని క్రియేట్ చేస్తాయి.ఇక వెంకటేష్,వరుణ్ తేజ్ లకు తమ భార్యలు ఎలాంటి సమస్యలు క్రియేట్ చేస్తారు..ఇక చివరకు వాళ్లిద్దరూ డబ్బు ఎలా సంపాదిస్తారు అనేది మిగిలిన కథాంశం.
నటి నటుల పనితీరు:వెంకటేష్,వరుణ్ తేజ్ తమ కామెడీ టైమింగ్ తో ఫుల్ గా ఆకట్టుకున్నారు.తమన్నా,మెహ్రిన్ కూడా తమ పాత్రలలో బాగా ఒదిగిపోయారు.తమన్నా స్పెషల్ ఎంట్రీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది.ఇక మిగితా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్:దర్శకుడు ఈ చిత్రాన్ని పూర్తి కామెడీ గా తెరకెక్కించారు.సినిమా మొత్తం కామెడీ ఉండడంతో కథ లేనట్లుగా అనిపించింది.సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది.ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది అనిపించింది.
విశ్లేషణ:ప్రీ క్లైమ్యాక్స్ క్లైమ్యాక్స్ లో కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.వెంకటేష్,వరు