మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉందో…ఏం చేస్తుందో తెలుసా…

తెలుగు సినిమా ప్రేక్షకులకు మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు,మంచు మనోజ్,మంచు లక్ష్మి తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.ఇక మంచు వారసుడిగా సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.మంచు మనోజ్ సోషల్ మీడియాలో కూడా పెద్దగా ఆక్టివ్ గా ఉండరు.వివాదాలకు ఎక్కువగా దూరంగా ఉంటారు మంచు మనోజ్.

ఇక ఈయన సినిమా వచ్చి కూడా ఇప్పటికే నాలుగు సంవత్సరాలు అయిందని చెప్పచ్చు.మంచు మనోజ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ప్రస్తుతం మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి అందరికి తెలిసిందే.ఈయన కర్నూల్ రాజకీయ కుటుంబానికి చెందిన దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె అయినా మౌనిక రెడ్డిని వివాహం చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలలో నిజం ఉందని త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారని సమాచారం.ప్రస్తుతం మంచు మనోజ్ రెండవ పెళ్లి వార్త వైరల్ అవుతుండడంతో ఆయన మొదటి భార్య ప్రస్తుతం ఎలా ఉంది..ఏం చేస్తుంది అనే దాని మీద కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.ఇక మంచు మనోజ్ మొదటి పెళ్లి ప్రణతి తో చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.ప్రేమించుకున్న వీళ్లిద్దరు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వలన వీరిద్దరూ విడిపోయారు.విడాకుల తర్వాత ప్రణతి రెడ్డి ప్రస్తుతం అమెరికా లో ఒంటరిగా జీవిస్తున్నట్లు సమాచారం.ఈమె అమెరికా లో ఇల్లుస్ట్రేషన్ అర్టిస్టా గా ఉన్నారని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *