సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మారుమూలాల ఉన్న చాల మంది టాలెంట్ బయటకు వస్తుంది.మరోపక్క కొంత మంది తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫారం ను వాడుకుంటున్నారు.ఇలా తమ టాలెంట్ ను నిరూపించుకున్న వారు ఎంతో మంది ఫాలోయింగ్ ను క్రేజ్ ను సంపాదించుకుని సోషల్ మీడియా నే జీవనాధారంగా మార్చుకున్నారు.అలా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న వాళ్లలో టిక్ టాక్ దుర్గారావు కూడా ఒకరు అని చెప్పచ్చు.
ఆయన తన టాలెంట్ తో సరికొత్త డాన్స్ పెర్ఫార్మన్స్ తో అందరిని నవ్వించి చాల ఫేమస్ అయ్యారు.నాది నకిలేసు గొలుసు సాంగ్ తో దుర్గారావు దంపతులు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.ఆ తర్వాత జబర్దస్త్ వంటి పలు స్టేజి షో లు చేసి అందరిని ఆకట్టుకున్నారు.వాళ్ళ డాన్స్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా యూట్యూబ్ లో కూడా బాగా ట్రెండింగ్ అవుతాయి అని చెప్పచ్చు.

ప్రస్తుతం ఈయన సోషల్ మీడియాలో సెలెబ్రెటీగా రాణిస్తున్నారు.ప్రస్తుతం దుర్గారావు కు చాల ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉంది.దింతో ఈయన జబర్దస్త్ తో పాటు జి తెలుగు,స్టార్ మా లోని ప్రోగ్రామ్స్ లలో కూడా వస్తూఉండడంతో ఈయన జీవితమే మారిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు.స్పెషల్ ఈవెంట్స్ కు భారీగా డబ్బులు ఇచ్చి పిలుస్తారు అనే సంగతి అందరికి తెలిసిందే.

దాంతో ఒక్కప్పుడు బట్టలు కొట్టుకుంటూ డాన్స్ చేసే దుర్గారావు నెల సంపాదన లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది.దుర్గారావు కొన్ని బ్రాండ్స్ వారికీ ప్రమోషన్స్ తో పాటు యూట్యూబ్ నుంచి అతనికి ప్రతి నెల 50 వేలు సంపాదన వస్తుందని చెప్తున్నారు.దాంతో విలక్షణమైన డాన్స్ దుర్గారావు ను మంచి గుర్తింపుతో పాటు లక్షాధికారిని చేసిందని అంటున్నారు.టాలెంట్ ఉంటె తప్పకుండ సక్సెస్ సాధించవచ్చు అని దుర్గారావు నిరూపించారు.
