Home » సినిమా » ఒకప్పటి విలన్ రఘువరన్ కొడుకు ఇప్పుడు హీరోలా ఉన్నాడు…ఎక్కడున్నాడో..ఏం చేస్తున్నాడో తెలుసా…

ఒకప్పటి విలన్ రఘువరన్ కొడుకు ఇప్పుడు హీరోలా ఉన్నాడు…ఎక్కడున్నాడో..ఏం చేస్తున్నాడో తెలుసా…

తన విలనిజంతో అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రముఖ నటుడు రఘువరన్.ఆయన తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం వంటి భాషల్లో విలన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చాల సినిమాలలో నటించి మెప్పించారు.శివ,పసివాడి ప్రాణం వంటి సినిమాలలో విలన్ గా అద్భుతమైన నటన కనపరిచారు.అంజలి వంటి క్లాసిక్ సినిమాలో తండ్రిగా కూడా నటించి అందరిని మెప్పించారు రఘువరన్.కెరీర్ ప్రారంభంలో హీరోగా,తర్వాత విలన్ గా,చివరలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు.

ఆయన ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలోనే ప్రకాష్ రాజ్ వంటి విలన్ లు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.ఆ తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.ముందుకు బానిసై కాలేయం దెబ్బతినడంతో అదే ఎఫెక్ట్ ఇతర అవయవాల మీద కూడా పడింది.దాంతో అతి చిన్న వయస్సులోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.రఘువరన్,రోహిణి దంపతులకు రిషి వరన్ అనే కొడుకు ఉన్నాడు.రఘువరన్ మంచి సంగీతకారుడు,గాయకుడూ అని ఆయన భార్య తెలిపారు.

వాటి మీద దృష్టి పెట్టండి అని భార్య అంటే..నేను మల్టీ టాస్కింగ్ చేయలేను..నటనతో పాటు వాటి మీద దృష్టి పెట్టలేను అని రఘువరన్ చెప్పేవారట.చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆయన కొన్ని పాటలు పాడి వీడియొ తీశారు.వాటిని నేను సేకరించి ఈ మధ్య వీడియొ ఆల్బం గా తయారు చేయించాను అంటూ రోహిణి తెలిపారు.ఈ ఆల్బం ను రజనీకాంత్ గారు ఆవిష్కరించారు.మొదటి సరిగా మా అబ్బాయి ఈ కార్యక్రమం కోసమే మీడియా ముందుకు వచ్చాడు అంటూ రోహిణి తెలిపారు.రఘువరన్ కొడుకు అమెరికా లో ప్రీమెడ్ డిగ్రీ చదువుతున్నట్లు రోహిణి గతంలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *