Actress: సినిమా తారలపై చాల మందికి అభిమానం ఉంటుంది.తమ ఇష్టమైన తరాల ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు చాల మంది.అదే రోజు వారి కటౌట్లు కూడా ఏర్పాటు చేస్తారు.తమ ఇష్టమైన తరాల పుట్టినరోజు నాడు అన్నదానాలు రక్తదానం కూడా నిర్వహిస్తారు చాల మంది అభిమానులు.చాల మంది అభిమానులు తమకు ఇష్టమైన సినిమా తరాల కోసం ఏం చేయడానికి అయినా వెనుకాడరు.కొంత మంది అభిమానులు తమకు ఇష్టమైన తరాల కోసం గుడి కూడా కట్టించారు.ఇప్పటి వరకు యెంత మంది హీరోయిన్లకు అభిమానులకు గుడి కట్టారంటే…
ఖుష్బూ:ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ అంటే చాల మందికి ఇష్టం.ఆమె సినిమాలను విడిచిపెట్టకుండా చూసేవారు చాల మంది.1991 సంవత్సరంలో ఖుష్బూ చిన తండ్రి షూటింగ్ లో ఉన్న సమయంలో ఆమె అభిమానులు ఆమె కోసం తిరుచ్చిలో ప్రత్యేకంగా గుడి కట్టించారు.
హన్సిక:చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తెలుగులో మొదటి సినిమా అయినా దేశముదురు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.తెలుగుతో పాటు ఈమె తమిళ్ లో కూడా సినిమాలు చేసింది.హన్సిక అభిమానులు చెన్నై శివారులో ఈమె కోసం గుడి కట్టించారు.
నమిత:సొంతం అనే మొదటి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ నమిత.ఆ తర్వాత ఈమె జెమినీ సినిమాతో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.ఇక తెలుగులో అవకాశాలు లేక కోలీవుడ్లో అడుగు పెట్టింది ఈ అమ్మడు.అక్కడ ఆమె అభిమానులు ఆమె కోసం కోయంబత్తూరు,తిరునవెల్లి తో పాటు మూడు గుడులు కట్టించడం జరిగింది.
నిధి అగర్వాల్:స్మార్ట్ శంకర్ తో నిధి కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.ఈమెకు తమిళ్ లో బాగా ఫ్యాన్స్ ఉన్నారు.ఈమె కోసం అభిమానులు చెన్నైలో గుడికట్టారు.నగ్మా:హీరోయిన్ నగ్మా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తమిళ్ లో ఈమెకు బాగా ఫాలోయింగ్ ఉండడంతో ఆమె అభిమానులు ఈమె కు తమిళ్ నాడు లో పలు చోట్ల ఆలయాలు కట్టించారు.
కాజల్ అగర్వాల్:ఒక సినిమా కోసం తమిళనాడు లో గుడి సెట్ చేయగా అందులో ఆమె అభిమానులు కాజల్ కి గుడి కట్టబోయారు.కానీ కాజల్ వారించడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
పూజ ఉమాశంకర్:ఇండో శ్రీలంక నటి అయినా ఈమెకు తమిళ్ లో బాగా అభిమానులు ఉన్నారు.ఈమె అభిమానులు శ్రీలంక లోని కొలంబోలో గుడి కట్టారు.
నయనతార:దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఈమె కోసం అభిమానులు గుడి కట్టాలని అనుకున్నారు.కానీ నయన్ నో చెప్పడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
సమంత:ఈమెకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఈమె కోసం ఇటీవలే ఒక అభిమాని ఆంధ్ర ప్రదేశ్ చుండూరు గ్రామంలో గుడి కట్టించారు.