మొదటి సినిమా ‘జాతి రత్నాలు’తో ఫేమ్ సంపాదించుకుంది ఫరియా అబ్దుల్లా. ఈ మూవీలో ఆమె మాటలు, పాటలు, అభినయం, అందం అందరినీ ఆకట్టకున్నాయి. ఈ చిత్రం తర్వాత నాగార్జున, నాగ చైతన్య నటించిన ‘బంగార్రజు’ చిత్రంలో ఓ సాంగ్ చేసి దుమ్ము రేపింది. డ్యాన్స్ చేసింది ‘జాతి రత్నాలు’ చిట్టేనా..? అనేలా ప్రేక్షకులను షాక్ కు గురిచేసింది ఈ సొగసరి.
అందాలను ఆ రేంజ్ లో ఆరబోసింది ఈ బ్యూటీ. ఫరియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పిక్స్, రీల్స్, వీడియోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ నెటిజన్లను అలరిస్తూనే ఉంటుంది.

అన్నట్లు ఫరియా మంచి డ్యాన్సర్ కూడా. తను చేసిన రీల్స్ చాలా బాగా వైరల్ అవుతూ ఉంటాయి. చిట్టి పోస్ట్ చేసిన ఈ చిత్రాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. బ్లాక్ ట్రెండీలో గ్లామర్ ఒలకబోస్తూ.. రకరకాల ఫోజులతో నెటిజన్ల మతి పోగొడుతోంది.

ప్రస్తుతం ఆమె చేతితో సంతోష్ శోభన్ తో కలిసి ‘లైక్ షేర్ అండ్ సబ్ స్ర్కైబ్’ మూవీ ఉంది. ఇది నవంబర్ 4న విడుదల కానుంది.
