తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి ఆ తర్వాత సూపర్ హిట్ అయినా సినిమాలు చాలానే ఉన్నాయి.అలాంటి సినిమాలలో జాతి రత్నాలు సినిమా కూడా ఒకటి అని చెప్పచ్చు.ఈ సినిమాలో చిట్టి పాత్రలో కనిపించిన ఫరియా అబ్దుల్లా తన నటనతో,అందంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.అయితే ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కడతాయి అని అందరు అనుకున్నారు.కానీ అలా ఆఫర్లు రాలేదని చెప్పచ్చు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో ఫరియా ఒక చిన్న అతిధి పాత్రలో నటించడం జరిగింది.ఇక నాగార్జున,నాగచైతన్య బంగార్రాజు సినిమాలో కూడా ఒక పాటలో ఆడి పాడిన సంగతి అందరికి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె కొన్ని సినిమాలతో బిజీ గా ఉంది.ప్రస్తుతం ఈమె రావణాసుర అనే సినిమాలో కూడా నటిస్తుంది.తాజాగా ఫరియా అబ్దుల్లా కు సంబంధించిన వీడియొ ఒకటి సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుందని చెప్పచ్చు.ఈ వీడియొ చూసిన వాళ్ళందరూ వామ్మో ఈమె ఏంటి ఇలా డాన్స్ చేసింది…ఫరియా ఇలా కూడా డాన్స్ చేస్తుందా అంటూ షాక్ అవుతున్నారు.ఈ వీడియొ లో ఫరియా బెల్లి డాన్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.

ఫరియా డాన్స్ వీడియొ చూసిన అందరు ఫిదా అయి కామెంట్స్ చేస్తున్నారు.కొంత మంది నెటిజన్లు డాన్స్ బాగా చేసావు అని కామెంట్స్ చేస్తున్నారు.మరికొంత మంది అయితే గుండెల్లో మంట పెట్టావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ముఖ్యంగా యువత ఈమె చేసిన డాన్స్ కు మైమరిచిపోతున్నారు.గతంలో ఫరియా ఎప్పుడు ఇలా డాన్స్ చేయడం జరగలేదు.దాంతో అందరు కూడా ఈమె ఇలా కూడా డాన్స్ చేస్తుందా అంటూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.ఫరియా ఈ విధంగా డాన్స్ చేస్తూ దర్శకనిర్మాతలు మెసేజ్ పంపిందని చాల మంది చెప్తున్నారు.
View this post on Instagram