జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.ఈ సినిమాతో ఆమె మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఫరియా అబ్దుల్లా హైదరాబాద్ లోని నిశుమ్బిత,డ్రామా నోన్,సమాహార,టార్న్ కర్టెన్,ఉదాన్ వంటి పలు ప్రసిద్ధ థియేటర్ లతో ప్రదర్శన ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం ఈమె నక్షత్ర వెబ్ సిరీస్ లో కూడా పని చేస్తుంది.ఫరియా అబ్దుల్లా స్కూల్ డేస్ లో లలిత కళలపై ఎక్కువగా ఆసక్తి చూపేవారు.
ఈమె సమ్మర్ క్యాంపు లలో డాన్స్ నేర్చుకోవడం పెయింటింగ్ వేయడం వంటివి ఆమెకు వ్యక్తిత్వాన్ని పెంచాయని ఈమె పలు సార్లు చెప్పడం జరిగింది.ఈమె 30 కి పైగా వేదికలపై ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది.ఈమెకు రాయడం,పెయింటింగ్ చేయడం అనే చాల ఇష్టమట.
చిన్నప్పటి నుంచి ఫరియా కు డాన్స్ అంటే ఆసక్తి ఉండడంతో ఆమె పేరెంట్స్ ఆమెను షామియాక్ దవర్ క్లాస్ లలో చేర్పించడం జరిగింది.ఫరియా కథక్ తో పాటు ప్రసిద్ధ డాన్స్ స్కూల్ నుంచి పాశ్యాత నృత్య రూపాలను కూడా నేర్చుకుంది.ఈమె ఆబ్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్ మరియు రచయితా.ఒక కార్యక్రమానికి నాగ్ అశ్విన్ ముఖ్య అతిధిగా వచ్చినప్పుడు ఆయన చిట్టి పాత్ర కోసం ఫరియా ను అడగడం జరిగింది.మొదటి సినిమాతోనే ఆమె తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది అని చెప్పచ్చు.