సినిమా ఇండస్ట్రీ లో సినిమా హిట్ అవ్వడం,ప్లాప్ అవ్వడం అనేది సర్వసాధారణమే.స్టార్ హీరోలు మరియు స్టార్ దర్శకుల కంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాల మీద ముందుగానే ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొంటాయి.సినిమా విడుదల అవ్వడానికి ముందు ఆ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందేమో అని అందరు అనుకుంటారు.కానీ కొన్ని సినిమాలు రిలీజ్ అయినా తర్వాత మాత్రం అనుకోని విధంగా పరాజయం పొందుతాయి.అలాగే మరికొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి.ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఒక సినిమా మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చిన చివరకు కమర్షియల్ గా హిట్ సినిమాగా నిలిచింది.
వన్ వంటి ప్లాప్ సినిమా తర్వాత సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో అనే సినిమా తెరకెక్కించారు.నాన్నకు ప్రేమతో సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ సినిమా.తండ్రి సెంటిమెంట్ తో రివెంజ్ డ్రామా గా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.నాన్నకు ప్రేమతో చిత్రం 2016 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు.ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు పూర్తి అయ్యిన తర్వాత సినిమా క్లాస్ గా ఉందని,ఎన్టీఆర్ ఇమేజ్ కు సూట్ కాలేదని అభిమానులు సుకుమార్ పై అసంతృప్తి వ్యక్తం చేసారు.
మొదటి రోజు పూర్తి అయ్యేసరికి సినిమా ప్లాప్ అని టాక్ రావడం జరిగింది.సుకుమార్ లాజిక్లు ప్రేక్షకులకు అర్ధం కాలేదని చాల మంది చెప్పుకొచ్చారు.నాన్నకు ప్రేమతో సినిమా తో పాటు అదే సంక్రాంతి కి బాలకృష డిక్టేటర్,నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా,శర్వానంద్ నటించిన ఎక్ష్ప్రెస్స్ రాజా వంటి చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి.దింతో నాన్నకు ప్రేమతో చిత్రం ప్లాప్ అవుతుంది అని ట్రేడ్ వర్గాలు కూడా అంచనాలు వేసాయి.రెండో రోజు నుంచి నాన్నకు ప్రేమతో చిత్రం బాగా పుంజుకొని క్లాస్ ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమా బాగా నచ్చింది.54 కోట్లు షేర్లు రాబట్టి చివరకు అద్భుతమైన విజయం దక్కించుకుంది నాన్నకు ప్రేమతో చిత్రం.ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.నాన్నకు ప్రేమతో చిత్రం తర్వాత ఎన్టీఆర్ కు క్లాస్ ప్రేక్షకులలో కూడా అభిమానులు పెరిగిపోయారు.