మొదటి రోజు ప్లాప్ టాక్ తెచ్చుకొని చివరకు బ్లాక్ బస్టర్ హిట్ అయినా 8 సినిమాలు యేవో తెలుసా…


సినిమా రంగంలో చివరలో ఆడియన్స్ ఇచ్చిన తీర్పుని బట్టి సినిమాల భవిష్యత్తు ఉంటుంది అనే విషయం తెలిసిందే.కొన్ని కొన్ని సార్లు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలు కూడా చివరలో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.అలాగే మరికొన్ని సినిమాలు మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చిన కూడా ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.అలా స్టార్టింగ్ లో ప్లాప్ టాక్ తెచ్చుకొని చివరకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా సినిమాలు ఏవంటే…

జల్సా:మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన మొదటి సినిమా జల్సా.2008 సంవత్సరంలో ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం చివరకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సరైనోడు:అల్లు అర్జున్,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో 2016 లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం.ఫస్ట్ డే ఈ చిత్రానికి కూడా నెగటివ్ టాక్ రావడం జరిగింది.మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడం అలాగే సమ్మర్ సీజన్ అవడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

జనతా గ్యారేజ్:ఎన్టీఆర్ మరియు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2016 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం కూడా మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకున్న చివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది.

జై సింహ:కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ చిత్రం 2018 సంక్రాతి కానుకగా ప్రేక్షుకుల ముందుకు వచ్చింది.మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చిన కూడా చివరకు సూపర్ హిట్ అయ్యింది.

సరిలేరు నీకెవ్వరూ:మహేష్ బాబు,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 2020 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదట నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.కానీ చివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

పుష్ప ది రైజ్:అల్లు అర్జున్,సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సొంతం చేసుకుంది.

బంగార్రాజు:నాగార్జున మరియు నాగచైతన్య హీరోలుగా వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకున్న కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యింది.

సర్కారు వారి పాట:సమ్మర్ కానుకగా రిలీజ్ అయినా ఈ చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *