24 ఏళ్ళ చిన్న వయస్సులో మొదటి మహిళా బస్ డ్రైవర్ గా షర్మిలా…సెల్యూట్ చేస్తున్న నెటిజన్లు…వీడియొ వైరల్…

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన షర్మిల బస్సు డ్రైవర్‌. కోయంబత్తూరులో బస్సు నడిపిన తొలి మహిళ. ఆమె బస్సు నడుపుతున్న దృశ్యాలు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఇతర యువతులను వారి కలలను కొనసాగించడానికి స్ఫూర్తినిస్తోంది.షర్మిల బస్సు డ్రైవర్ కాకముందు అనేక రకాల ఉద్యోగాలు ప్రయత్నించింది. డ్రైవింగ్ నేర్చుకుని బతుకుదెరువు కోసం కష్టపడి బస్ డ్రైవర్ అయ్యానని చెప్పింది.

Advertisement

పురుషుల మాదిరిగానే మహిళలు కూడా నైపుణ్యంగా బస్సులు నడపగలరని షర్మిల నిరూపించింది.  మహిళలు కూడా పర్ఫెక్ట్‌గా బస్సులు నడపగలరని స్టీరింగ్ పట్టుకొని బస్సు నడిపి నిరూపించింది షర్మిల. షర్మిల తన డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తరువాత, ఒక ప్రైవేట్ బస్సు ఆపరేటర్ వద్ద బస్సు డ్రైవర్ పదవికి దరఖాస్తు చేసుకుంది. షర్మిల స్టీరింగ్ స్కిల్స్ చూసి ఆమెకు డ్రైవింగ్ టెస్ట్ పెట్టిన యజమానులు ఆశ్చర్యపోయారు.

ఆమె ప్రతిభను గుర్తించి బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం ఇప్పించారు. అలా గాంధీపురం-సోమనూరు మార్గంలో షర్మిల బస్సు నడుపుతున్నారు.ప్రస్తుతం షర్మిల బస్సు నడుపుతున్న వీడియోను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యం పొందుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *