Home సినిమా ఎన్టీఆర్ తో కొరటాల మూవీ.. రాజేంద్ర ప్రసాద్ చిత్రం టైటిల్ తో వస్తుంది.. ఆ సినిమా...

ఎన్టీఆర్ తో కొరటాల మూవీ.. రాజేంద్ర ప్రసాద్ చిత్రం టైటిల్ తో వస్తుంది.. ఆ సినిమా ఏంటో తెలుసా..!

0
JR NTR Koratala Siva
JR NTR Koratala Siva

ట్రిపుల్ ఆర్(RRR) సక్సెస్ తర్వాత ఇప్పటి వరకూ ఎన్టీఆర్ తర్వాత మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ఇటీవల ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నారన్న విషయం వైరల్ గా మారింది. ఈ మూవీ టైటిల్ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.డైరెక్టర్ రాజమౌళి చేసిన రీసెంట్ మూవీ ట్రిపుల్ ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. కొమురం భీం పాత్రలో ఆయన ఒదిగిన తీరు, నటన వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు పొందింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఇంటర్ నేషనల్ లెవల్ లో ఈ మూవీ బాగా పాపులర్ అయ్యింది. ఈ మధ్యే జపాన్ భాషలో కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

ఇప్పటి వరకూ ఎన్టీఆర్ ఎలాంటి కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టలేదు. కొరటాల శివ చెప్పిన కథకు యంగ్ టైగర్ ఒకే అన్నా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దీనికి సినీ ఇండస్ర్టీతో పాటు యంగ్ టైగర్ వివిధ కారణాలు చెప్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా లెవల్ లోనే కథను ఎంచుకొని తీయాలని అనుకుంటున్నాడట. అందుకు తగ్గ కథ ఎంపిక చేయడంలో కొంత ఆలస్య ఉంటుందని టాక్. కొరటాల కథ కూడా అదే రేంజ్ లో ఉండడంతో నవంబర్ లో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ఇండస్ర్టీ భావిస్తోంది. కొరటాల మూవీ ఇండియాలో దాదాపు అన్ని భాషలతో సహా జపనీస్, చైనీస్ ల్యాంగ్వేజీలలో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట. అందుకు తగ్గట్టుగా కథలో కూడా మార్పులు చేస్తున్నారట. ‘బాద్ షా, ట్రిపుల్ ఆర్’ వంటి మూవీస్ తో యంగ్ స్టార్ కు ఇండియాలోనే కాకుండా వెస్ర్టన్ కంట్రీస్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారీ సెట్టింగులతో ప్లాన్ చేస్తున్నారట కొరటాల శివ.

JR NTR Koratala Siva
JR NTR Koratala Siva

కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ వీరికి రెండో ప్రాజెక్టు. దీంతో ఈ మూవీపై జూ. ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకుంటున్నారట.  ఈ చిత్రంపై ఎన్నో గాసిప్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల కూడా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను లాక్ చేసినట్లు న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఈ చిత్రానికి ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

రాజేంద్ర ప్రసాద్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం టైటిల్ ను ఈ సినిమాకు పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇది ఎంత వరకు నిజమో వేచి చూస్తే తెలుస్తోంది. కొరటాలతో గతంలో ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ తీశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. రెండో సారి ఇదే కాంబోలో మూవీ అనడంతో ఎన్టీఆర్ అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి భారీ అంచనాలు పెట్టుకుంటున్నాట. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

ట్రిపుల్ ఆర్ సక్సెస్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఎన్టీఆర్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తూనే ఉంది. సన్ని వేశాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలని భావిస్తున్నారట. అన్ని పక్కాగా కుదిరితేనే షూటింగ్ ప్రారంభిద్దామని అనుకుంటున్నాడట. ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఇది నెటిజన్లను, ఆయన అభిమానులను ఆకట్టుకుంటూ వైరల్ గా మారింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here