టాలెంట్ ఉంటె అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి అన్న విషయం అందరికి తెలిసిందే.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి టాలెంట్ ఉన్న చాల మందికి సినిమాలలో అవకాశాలు వచ్చాయి.ప్రపంచం నలుమూలల ఉన్న టాలెంట్ సోషల్ మీడియా వేదికగా వీడియోల రూపంలో బయటపడుతుంది.చాల మంది సోషల్ మీడియా వేదికగా వీడియోలు చేయడంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని సెలెబ్రెటీలుగా మారారు.ఇలా సోషల్ మీడియా వేదికగా మంచి క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో గాజువాక బస్సు కండక్టర్ ఘాన్సీ కూడా ఒకరు అని చెప్పచ్చు.
ఇటీవలే ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన అధితమైన డాన్స్ వీడియొ వైరల్ అయినా సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలో ఆమె డాన్స్ వీడియోలు చూసిన మల్లెమాల వారు ఝాన్సీ కి శ్రీదేవి డ్రామా కంపెనీ లో అవకాశాన్ని కల్పించారు.ఇలా ఈమె ఒక్కసారిగా సెలెబ్రెటీగా మారిపోయి ఈ షో ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుని ఇంటర్వ్యూ లకు హాజరవుతున్నారు.ప్రస్తుతం ఈమె సెలెబ్రెటీ గా బిజీ గా గడుపుతున్నారు.అయితే తాజాగా ఈమెకు సినిమాలలో కూడా నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తన తరువాతి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయడం కోసం తానె స్వయంగా ఝాన్సీ కి ఫోన్ చేసి అవకాశం ఇచ్చినట్లు సమాచారం.ఇలా తనకు ఫోన్ చేసి సంపూర్ణేష్ బాబు అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంతో ఆ సాంగ్ లో నటించడానికి ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం.ఈ స్పెషల్ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందట.అయితే టాలెంట్ ఉన్న ఝాన్సీని సంపూర్ణేష్ బాబు వెండి తెరకు పరిచయం చేస్తుండడంతో నెటిజన్లు ఆయనకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.