60 ఏళ్ళ బామ్మా కు చిరంజీవి నటించిన ఆ హిట్ సినిమా చూపిస్తూ సర్జరీ చేసిన డాక్టర్లు…


సాధారణంగా డాక్టర్లు కొన్ని రకాల ఆపరేషన్లు చేసే సమయంలో అనస్థీషియా ఇవ్వకుండానే ఆపరేషన్ చేయటం జరుగుతుంది.డాక్టర్లు బ్రెయిన్ కు సంబంధించిన ఆపరేషన్ చేసే సమయంలో మత్తు ఇవ్వకుండా వారిని మాటల్లో పెట్టి ఆపరేషన్ చేస్తారు.ఈ క్రమంలోనే ఇటీవలే గాంధీ ఆసుపత్రిలో డాక్టరు ఒక 60 ఏళ్ళు ఉన్న మహిళకు ఎటువంటి మత్తు ఇవ్వకుండా బ్రెయిన్ కు సర్జరీ నిర్వహించడం జరిగింది.ఈ మహిళా మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని కావడంతో చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా చూస్తూ ఈ మహిళా సర్జరీ చేయించుకోవడం జరిగింది.

ఇక సర్జరీ మధ్య మధ్యలో డాక్టర్లు కూడా ఆమెతో మాట్లాడుతూ సర్జరీ చేస్తున్నాము అనే భావన లేకుండా చాల సునాయాసంగా సర్జరీ పూర్తి చేసారు.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఇక సర్జరీ చేయించుకున్న మహిళా తానూ చిరంజీవి కి చాల పెద్ద అభిమాని అని చిరంజీవి నటించిన అన్ని సినిమాలు చూస్తూ ఉంటానని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తన పీఆర్వో ను గాంధీ ఆసుపత్రికి పంపించి అక్కడి డాక్టర్లను సంప్రదించమని తెలిపారు.

అక్కడికి వెళ్లిన చిరంజీవి పీఆర్వో ఆనంద్ వైద్యులను సంప్రదించి అలాగే చిరంజీవి అభిమానిని పరామర్శించటం జరిగింది.అదే సమయంలో మహిళా తాను చిరంజీవి గారికి వీరాభిమాని అని చెప్పడం జరిగింది.దాంతో ఆనంద్ వెళ్లి అదే విషయాన్నీ చిరంజీవి గారికి చెప్పడంతో ఆయన వీలు చూసుకొని మరో రెండు మూడు రోజుల్లో ఆ మహిళా అభిమానిని పరామర్శిస్తాను అని తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న మహిళా అభిమాని మరియు అక్కడి వైద్య సిబ్బంది ఆనందం వ్యక్తం చేసారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *