తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గురువారం సాయంత్రం కన్నుమూశారు.సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆయన తన తుది శ్వాసను విడిచారు.తెలుగు చిత్ర పరిశ్రమకు 1986 సంవత్సరంలో మొదటి సినిమా అయినా సిరివెన్నెల చిత్రంతో పాటల రచయితగా పరిచయం అయ్యారు సీతారామశాస్త్రి.
మొదటి చిత్రంతోనే ఉత్తమ గేయ రచయితగా అవార్డు అందుకొని తనకు పేరు తెచ్చిన ఆ మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకొని సిరివెన్నెల సీతారామశాస్త్రిగా పేరు తెచ్చుకున్నారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు రచించిన ఘనత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిది.సీతారామశాస్త్రిగారు 2019 పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు.అలాగే గాయం,స్వర్ణకమలం,సింధూరం,శుభలగ్