Home రివ్యూలు Godfather Review: గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్…ఇంతకీ సినిమా ఎలా ఉందంటే…

Godfather Review: గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్…ఇంతకీ సినిమా ఎలా ఉందంటే…

0
Godfather Movie Review And Ratings
Godfather Movie Review And Ratings

గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 ,2022 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో చిరంజీవి నయనతార ప్రధానపాత్రలలో నటిస్తున్నారు.ఈ చిత్రానికి జయం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.మలయాళం సినిమా అయినా లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు.సినిమా విడుదలకు ముందు రోజు సాయంత్రం లిరికల్ వీడియోలు రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.
కథ:ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వదమన్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో జన జాగృతి పార్టీలో రాజకీయ చీలిక ఏర్పడుతుంది.ఆ తర్వాతి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిమీద రాష్ట్రమంతా అయోమయంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కూతురి సత్యప్రియ (నయనతార)భర్త సత్యదేవ్ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటాడు.

Godfather

ఆ సమయంలోనే ఈ రాజకీయ చదరంగాని సరిదిద్దడానికి రంగంలోకి దిగుతాడు కింగ్ మేకర్ బ్రహ్మ (చిరంజీవి).ఈయన ఎంట్రీ తో అప్పటివరకు ఉన్న సందిగ్థత అంతా కూడా తొలగిపోయి అన్ని ఒక్కొక్కటి క్లియర్ అవుతూ ఉంటాయి.ఇంతకీ బ్రహ్మ ఎవరు…ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించగల శక్తిగా ఎలా ఎదిగాడు….జయదేవ్ ను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథాంశం.

నటీనటుల పనితీరు:చిరంజీవి యెంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయనవి గత కొన్ని సినిమాలు నిరాశపరిచిన ఈ సినిమాతో మల్లి పాత చిరంజీవిని చూడవచ్చు.దర్శకుడు మోహన్ రాజా నటుడిగా చిరంజీవి ని మరియు ఆయన కళ్ళను బాగా వినియోగించుకున్నారు.ఈ సినిమాలో మెగాస్టార్ కళ్ళ షాట్స్ కోసం మరో సారి సినిమా చూడచ్చు అనిపిస్తుంది.ఈ సినిమాలో సత్యేదేవ్ కూడా అద్భుతంగ నటించారు అని చెప్పచ్చు.ఇక సల్మాన్ ఖాన్ ఎలివేషన్ షాట్స్ మాత్రం సినిమాకు అవసరమా అన్నట్టు అనిపించినా చిరంజీవి తో కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి.ఇక చిరంజీవి చెల్లెలిగా నయనతార,సముద్ర ఖని,మురళి శర్మ తదితరులు బాగానే అలరించారు.సర్వదమన్ ను చాల రోజుల తర్వాత ఒక ముఖ్యమైన పాత్రలో చూడడం అందరికి సంతోషాన్ని కలిగించింది.

సాంకేతికవర్గం పనితీరు:తెలుగు దర్శకులు కాకుండ తమిళ దర్శకుడు జయం మోహన్ రాజా కు ఈ సినిమా దర్శకత్వం బాధ్యత అప్పగించడంతో మొదట చాల నెగటివ్ టాక్ వినిపించాయి.అయితే వీటన్నిటికీ సినిమాతో సమాధానం చెప్పారు మోహన్ రాజా.చిరంజీవిలో నటుడిని చరిష్మాను అద్భుతంగా వాడుకోవడమే కాకుండా లూసిఫర్ కథను బ్రహ్మ ఎలివేషన్ కు మాత్రమే వాడుకొని కథలో మార్పులు చేసి చాల అద్భుతముగా తెరకెక్కించారు.దర్శకుడిగా మోహన్ రాజా పూర్తిగా న్యాయం చేసాడు.ఇక పాటలతో కొంత నిరాశపరిచిన తమన్ నేపథ్య సంగీతంతో మాత్రం బాగా అలరించాడు.

విశ్లేషణ:చిరంజీవి అభిమానులు ఆశించిన దానికంటే ఎక్కువగానే ఈ చిత్రం ఉందని చెప్పచ్చు.89 కోట్లు బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించటం ఈ సినిమాకు చాల ఈజీ అని చెప్పచ్చు.
రేటింగ్:4 /5 .

Previous articleక్యూట్ గా నవ్వుతున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా…టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్…
Next articleవెన్నెల హీరోయిన్ పార్వతి మెల్టెన్ ఇప్పుడు ఎలా ఉందో..ఏం చేస్తుందో తెలుసా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here