Home Sports గూగుల్ సీఈఓ నా మజాకానా…పాకిస్తానీ కామెంట్ కు ఆయన ట్రోలింగ్ మాములుగా లేదుగా…

గూగుల్ సీఈఓ నా మజాకానా…పాకిస్తానీ కామెంట్ కు ఆయన ట్రోలింగ్ మాములుగా లేదుగా…

0
Sundar Pichai IND vs PAK

Google CEO: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ క్రికెట్‌కు వీరాభిమాని. ప్రస్తుతం నడుస్తున్న టీ 20 వరల్డ్ కప్ ను ఆయన బాగా ఆస్వాదిస్తున్నారట. క్షణం తీరికున్నా ఏ టీం ఎంత మేరకు పర్ఫార్మెన్స్ చేసిందో చూస్తున్నారట. ఇందులో భాగంగా ఆదివారం ఇండియా వర్సెస్ పాక్ మధ్య ఆస్ర్టేలియాలోని వెల్బోర్న్ వేధికగా జరిగిన మ్యాచ్ ను ఆయన ఫుల్ గా ఎంజాయ్ చేశారట. ఆయనే కాదు ఈ మ్యాచ్ ప్రత్యక్ష్యంగా 90వేల మంది చూసి ఎంజాయ్ చేస్తే, టీవీలు, ఇతర మాద్యమాల నుంచి కోట్లాది మంది వీక్షించారు. మరీ ముఖ్యంగా చివరి ఓవర్ల గురించి జరుగుతున్న చర్చ, రచ్చ అంతా ఇంతా కాదు. ఒక దశలో భారత్ ఓటమి పాలవుతుందేమోనని బాధ పడ్డవారూ కోట్లాదిగా ఉన్నారు. కింగ్ కోహ్లీ, హార్థిక పాండ్యా వీరోచిత పోరాటం చరిత్రలో గుర్తుంచుకునేలా ఉంటే. చివరి మూడు ఓవర్లు మాత్రం ఇరు దేశాలతో పాటు, ప్రపంచం మొత్తం గుర్తుంచుకుంటుంది. 

క్రికెట్ అభిమాని, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఈ మ్యాచ్ ను చూశారు. గేమ్ ముగిసిన వెంటనే ‘హ్యాపీ దివాళీ. ఈ వేళ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నా. మ్యాచ్ చివరి ఓవర్లు చూసిన నేను కూడా పండుగ సంబురాలను ఆనందంగా జరుపుకుంటున్నా. అద్భుత ఆట, అత్యద్భుత ప్రదర్శన’ అంటూ ట్వీచ్ చేశారు. టీ20, టీమిండియా హ్యాష్ ట్యాగ్ లను ఆయన జత చేశారు. 

ఈ ట్వీట్ కు ఓ పాకిస్తానీ మహ్మద్ షహజీబ్ స్పందించారు. ‘మీరు తొలి మూడు ఓవర్లు కూడా చూడండని (పాక్ బౌలింగ్ లో తొలి 3 ఓవర్ల విషయమై.. రాహుల్ 4 పరుగులకే ఔటయ్యాడని) రీ ట్వీట్ చేశాడు. అతడి ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న సుందర్ పిచాయ్ అది కూడా చూశాను భువీ, హర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారంటూ ప్రశంసించాడు. దీంతో సదరు పాకిస్తానీ నేను చెప్పింది ఇండియా ఇన్నింగ్స్ అంటూ మరో ట్వీట్ చేశాడు. దీన్ని సుందర్ పిచాయ్ లైట్ తీసుకున్నాడు. 

కానీ నెటిజన్లు మాత్రం షహజీబ్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. సుందర్ పిచాయ్ సమయస్ఫూర్తిని కొందరు పొగిడితే.. మరి కొందరు అంతటి గొప్ప వ్యక్తి నిన్ను ట్రోల్ చేశాడు. ‘సుందర్ పిచాయ్ రిప్లయ్ ని స్ర్కీన్ షాట్ తీసుకొని పెద్దగా ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకో, అది కోట్లాది రూపాయలు విలువ చేస్తుంది’ అంటూ సూచించారు. ఇంకా ఏడుసుడు ఎందుకు అంతటి గొప్ప గూగుల్ సీఈవో నీన్ను ట్రోల్ చేశాడు భయ్యా.. అంటూ పాకిస్తానీకి సూచించారు. 

ఇక కొందరైతే మీ జీడీపీలో సగం ఒక్క ట్రోల్ తో సంపాదించినట్టున్నావ్ అంటూ సెటైరికల్ గా రియాక్ట్ అయ్యారు. ఇండియా నెటిజన్ల రిక్వెస్టుల మేరకు ‘సుందర్ పిచాయ్ రీ ట్వీట్’ ను ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలని డిసైడయ్యా అంటూ షహజీబ్ ట్వీట్ చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here