ఆ ఒక్క కారణం వలనే ఒక్కడు బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న గోపీచంద్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో గోపీచంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గా చేసినా కూడా ఆ తర్వాత హీరోగా వరుస సినిమా లు చేసి హిట్స్ అందుకున్నారు గోపీచంద్.ప్రస్తుతం గోపీచంద్ నటించిన పక్క కమర్షియల్ అనే చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది.ఈ చిత్రం లో గోపీచంద్ కు జోడిగా రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జి ఏ 2 పిక్చర్స్ బ్యాన్నారు పై బన్నీ వాస్ నిర్మించడం జరిగింది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా ట్రైలర్,టీజర్,పాటలు అన్ని కూడా ప్రేక్షకులలో ఈ చిత్రంపై భారీగా అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి.హీరో గోపీచంద్ కూడా తన సినిమాను గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ప్రమోట్ చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో గోపీచంద్ అలీతో జాలిగా అనే షో లో పాల్గొనడం జరిగింది.

Gopi Chand
Gopi Chand

ఈ షోలో అలీ అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధాం చెప్పారు గోపీచంద్.ఇదే క్రమంలో గతాన్ని గుర్తుచేసుకుంటూ గోపీచంద్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.నిజం సినిమాలో హీరో మహేష్ బాబు కు చిత్రహింసలు పెట్టె విలన్ గా గోపీచంద్ నటించిన సంగతి అందరికి తెలిసిందే.

Okkadu Movie
Okkadu Movie

అయితే గోపీచంద్ కు ఒక్కడు సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ పాత్రలో నటించే అవకాశం వచ్చిందని ఈ షో లో చెప్పుకొచ్చారు గోపీచంద్.ఒక్కడు సినిమా సమయంలో ప్రకాష్ రాజ్ కాల్ షీట్స్ బిజీ గా ఉండడంతో ఒక్కడు సినిమా యూనిట్ గోపీచంద్ ను సంప్రదించారట.ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్ తన పాత్ర గురించి గోపీచంద్ కు వివరించారట.కానీ ఆ తర్వాత నేను డేట్స్ అడ్ జస్ట్ చేస్తాను అని ప్రకాష్ రాజ్ చెప్పడంతో ఆయన్నే ఓకే చేశారట చిత్ర యూనిట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *